జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.
గ్లోబల్ సౌత్ దేశాల వాణిని వినిపించడంలో భారత్ నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
‘‘ఎక్స్’’ వేదికపై బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన పోస్టుకి ప్రతిస్పందిస్తూ...
“ప్రియ మిత్రులు... దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో ప్రత్యేకంగా మాట్లాడాను. గ్లోబల్ సౌత్ దేశాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాల పట్ల మాది తిరుగులేని నిబద్ధత. మరింత మెరుగైన.. నిర్మాణానికి అవసరమైన అన్ని చర్యలనూ చేపట్టేందుకు మేం సిద్ధం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
O Sul Global se faz presente no G7. Encontro com @CyrilRamaphosa 🇿🇦 e @narendramodi 🇮🇳
— Lula (@LulaOficial) June 17, 2025
📸 @ricardostuckert pic.twitter.com/puPsEMWix2


