సుల్తాన్ పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా నిర్మాణం జరిగిన 3.2 కి.మీ. పొడవైన ఎయర్ స్ట్రిప్ పై జరిగిన ఎయర్ శో ను కూడా ప్రధాన మంత్రి వీక్షించారు
‘‘ఈ ఎక్స్ ప్రెస్ వే ఉత్తర్ ప్రదేశ్ లో తీసుకొన్న సంకల్పాల సాధన కు ఒక నిదర్శనం గా ఉంది, మరి ఇది యుపి యొక్క గౌరవం గాను, అద్భుతం గాను ఉంది’’
‘‘ప్రస్తుతం, పూర్వాంచల్ కోర్కెల కు పశ్చిమ ప్రాంత కోర్కెల మాదిరిగానే సమానమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతోంది’’
‘‘ఈ దశాబ్దం యొక్క అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ఒక సమృద్ధమైన ఉత్తర్ ప్రదేశ్ ను నిర్మించడం కోసం మౌలిక సదుపాయాల ను కల్పించడం జరుగుతోంది’’
‘‘రెండు ఇంజిన్ ల ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి కి పూర్తి గా కంకణం కట్టుకొని ఉంది’’

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. సుల్తాన్ పుర్ జిల్లా లో ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా నిర్మాణం జరిగిన 3.2 కి.మీ. పొడవైన ఎయర్ స్ట్రిప్ మీదుగా సాగిన ఎయర్ శో ను కూడా ఆయన తిలకించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మూడు సంవత్సరాల కిందట పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపన చేస్తున్న వేళ లో ఒక రోజు న అదే ఎక్స్ ప్రెస్ వే పైన నేల మీదకు దిగివస్తానని తాను ఊహించలేదన్నారు. ‘‘ఈ ఎక్స్ ప్రెస్ వే ఒక ఉత్తమ భవిష్యత్తు కు వేగం గా దారి తీస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి కోసం ఉద్దేశించింది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఒక కొత్త ఉత్తర్ ప్రదేశ్ ను నిర్మించడం కోసం ఉద్దేశించినటువంటిది. ఈ ఎక్స్ ప్రెస్ వే యుపి లోని ఆధునిక సౌకర్యాల కు ఒక ప్రతిబింబం గా ఉంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఉత్తర్ ప్రదేశ్ లో చెప్పుకొన్న సంకల్పాల సాధన కు ఒక నిదర్శనం గా ఉంది. మరి ఇది ఉత్తర్ ప్రదేశ్ యొక్క గౌరవం గా, ఉత్తర్ ప్రదేశ్ యొక్క అబ్బురం గా కూడాను ఉంది.’’ అని ఆయన అన్నారు.

యావత్తు దేశం అభివృద్ధి చెందాలి అంటే దేశం లో సంతులిత అభివృద్ధి జరగడం అనేది అంతే అవసరం అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి లో ముందుకు సాగిపోతూ, మరికొన్ని ప్రాంతాలు దశాబ్దుల తరబడి వెనుకపట్టు న నిలచి పోయాయి అని ఆయన అన్నారు. ఈ అసమానత్వం ఏ దేశానికి అయినా మంచిది కాదు అని ఆయన అన్నారు. భారతదేశం లోని తూర్పు ప్రాంతాల తో పాటు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి కి ఎంతో సామర్ధ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా దేశం లో చోటు చేసుకొంటున్న అభివృద్ధి నుంచి ఏమంత ప్రయోజనాన్ని పొందలేదు అని ఆయన అన్నారు. చాలా కాలం పాటు పాలన ను సాగించిన ఇదివరకటి ప్రభుత్వాలు ఉత్తర్ ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి విషయం లో ధ్యాస పెట్టలేదు అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంతం లో ఈ రోజున అభివృద్ధి తాలూకు ఒక కొత్త అధ్యాయం ఆరంభం కాబోతోంది అని ఆయన చెప్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే పనులు పూర్తి అయిన సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కు, ఆయన బృందాని కి ప్రధాన మంత్రి ప్రశంసల ను వ్యక్తం చేశారు. ఈ పథకం కోసం సేకరించిన రైతు ల భూమి కి గాను ఆయన ధన్యవాదాలు తెలియ జేశారు. ఈ ప్రాజెక్టు లో పాలుపంచుకొన్న ఇంజినీర్ లను, శ్రమికుల ను ఆయన పొగడారు.

దేశం యొక్క సమృద్ధి కోవ లోనే దేశ రక్షణ సైతం సమానమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంగతి ని దృష్టి లో పెట్టుకొని, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించేటప్పుడు యుద్ధ విమానాలు అత్యవసరం గా దిగేందుకు ఏర్పాటు ను చేయడమైందని ఆయన చెప్పారు. ఈ విమానాల గర్జన లు దశాబ్దాల తరబడి దేశం లో రక్షణ రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను అలక్ష్యం చేసిన వారి కోసం ఉద్దేశించినవి అని ఆయన అన్నారు.

గంగా మాత, ఇంకా ఇతర నదుల జలాల ప్రవాహం తో తడిసే సువిశాలమైనటువంటి ప్రాంతం ఉన్నప్పటికీ ఏడెనిమిది ఏళ్ళ కు పూర్వం వరకు ఎలాంటి అభివృద్ధి జరుగకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. 2014వ సంవత్సరం లో దేశాని కి సేవ చేసేటటువంటి ఒక అవకాశాన్ని తన కు ఈ దేశం ఇచ్చినప్పుడు ఉత్తర్ ప్రదేశ్ యొక్క అభివృద్ధి కి తాను ప్రాధాన్యాన్ని ఇచ్చానని ఆయన అన్నారు. పేద ప్రజలు పక్కా ఇళ్ళ కు నోచుకోవాలి. వారు టాయిలెట్ లను కలిగి ఉండాలి, మహిళ లు ఆరుబయలు ప్రదేశాల లో మలమూత్రాదుల విసర్జన అనే అగత్యం పాలబడకూడదు; అంతేకాకుండా, ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్ళ లో విద్యుత్తు సౌకర్యాన్ని పొందాలి. మరి, ఈ విధమైన అనేక పనులు ఇక్కడ జరగవలసిన అవసరం ఉండింది అని ఆయన ప్రస్తావించారు. ఇదివరకటి ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి విమర్శిస్తూ, అప్పటి యుపి ప్రభుత్వం ఈ సదుపాయాల కల్పన లో తనకు సమర్ధన ను ఇవ్వలేదని చెప్పి, అందుకుగాను తాను తీవ్రమైన వేదన కు లోనయ్యానన్నారు. ‘‘ఉత్తర్ ప్రదేశ్ ప్రజల పట్ల అన్యాయం గా ప్రవర్తించినందుకు, అభివృద్ధి లో భేదభావాన్ని ప్రదర్శించినందుకు మరియు అప్పటి ప్రభుత్వం ద్వారా కేవలం వారి కుటుంబం తాలూకు ప్రయోజనాలను మాత్రమే సిద్ధింపచేసుకొన్నందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రజానీకం అప్పటి ప్రభుత్వాన్ని జవాబుదారు ను చేసి, గద్దె దించుతారు అని నాకు అనిపించింది’’ అని ఆయన అన్నారు.

ఇది వరకు ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నిసార్లు విద్యుత్తు కోతలు జరిగేవో ఎవరు మరచిపోగలరు?, యుపి లో చట్టం మరియు వ్యవస్థ స్థితి ఎలా ఉండేదో ఎవరు విస్మరించగలరు?, యుపి లో వైద్య చికిత్స సదుపాయాల స్థితి ఏమిటనేది ఎవరు మాత్రం మరువగలరు? అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నల ను వేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో గత నాలుగున్నర సంవత్సరాల కాలం లో- అది తూర్పు ప్రాంతం అయినా గాని, లేదా పశ్చిమ ప్రాంతం అయినా గాని- వేల కొద్దీ గ్రామాల ను కొత్త రహదారుల తో జోడించడం జరిగిందని, మరి వేల కొద్దీ కిలో మీటర్ల మేర సరికొత్త రహదారుల ను నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు.

ప్రజల చురుకైన భాగస్వామ్యం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లో అభివృద్ధి తాలూకు కల ప్రస్తుతం సాకారం అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త గా వైద్య కళాశాల లను నిర్మించడం జరుగుతోంది, ఎఐఐఎమ్ఎస్ రూపు దాల్చుతోంది, ఆధునిక విద్యా సంస్థల ను ఉత్తర్ ప్రదేశ్ లో నిర్మించడం జరుగుతోంది. కుశీనగర్ లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేవలం కొద్ది వారాల క్రితం ప్రారంభించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ వంటి విశాలమైన ఒక రాష్ట్రం లో కొన్ని ప్రాంతాలు పూర్వం ఒకదాని నుంచి మరొకటి చాలా వరకు సంబంధాలు ఏర్పడకుండా ఉండిపోయిన మాట నిజం అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ప్రజలు రాష్ట్రం లో వేరు ప్రాంతాల కు వెళ్ళే వారు. అయితే, సంధానం లోపించినందువల్ల వారు ఇక్కట్టు ల పాలు అయ్యేవారు. ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత జనత కు చివరకు లఖ్ నవూ కు చేరుకోవాలన్నా ఎంతో గగనం గా ఉండేది. ‘‘మునుపు ముఖ్యమంత్రుల కు అభివృద్ధి అనేది వారి నివాసాల కే పరిమితం అయింది. కానీ, ప్రస్తుతం పూర్వాంచల్ కోర్కెల కు పశ్చిమ ప్రాంత కోర్కెల మాదిరిగానే సమానమైనటువంటి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ ఎక్స్ ప్రెస్ వే అంతు లేని ఆకాంక్షలను కలిగి ఉన్ననటువంటి మరియు అభివృద్ధి కి భారీ అవకాశాల ను కలిగి ఉన్నటువంటి నగరాల ను లఖ్ నవూ తో కలుపుతుంది అని ఆయన చెప్పారు. ఎక్కడయితే మంచి రహదారులు ఉంటాయో, ఎక్కడయితే మంచి రాజమార్గాలు ఉంటాయో అక్కడ అభివృద్ధి తాలూకు జోరు అధికం అవుతుంది, ఉద్యోగ కల్పన వేగవంతం అవుతుంది అని ఆయన అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అంటే గనుక శ్రేష్ఠమైనటువంటి సంధానం అవసరం. యుపి లో ప్రతి మూల ను జోడించడం జరగాలి అని ప్రధాన మంత్రి అన్నారు. యుపి లో ఎక్స్ ప్రెస్ వే లు సిద్ధం అవుతున్నట్లుగానే ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు పని కూడా మొదలయింది అని ఆయన అన్నారు. అతి త్వరలో కొత్త కొత్త పరిశ్రమలు పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కు చుట్టు పక్కల రావడం ఆరంభం అవుతుంది, ఈ ఎక్స్ ప్రెస్ వే లను ఆనుకొని ఉన్న నగరాల లో ఫూడ్ ప్రాసెసింగ్, పాలు, శీతల గిడ్డంగులు, కాయగూరలు, పండ్లు, తృణధాన్యల నిలవ సదుపాయాలు, పశు పోషణ, ఇంకా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు రానున్న రోజుల లో చాలా వేగం గా వర్ధిల్లనున్నాయి అని ఆయన అన్నారు. యుపి పారిశ్రామికీకరణ కు నైపుణ్యం కలిగిన శ్రమికులు ఎంతో అవసరం అని ఆయన అన్నారు. కాబట్టి, శ్రమికుల కు శిక్షణ ను ఇచ్చే పని కూడా మొదలైంది అని ఆయన తెలిపారు. ఈ నగరాల లో ఐటిఐ, ఇంకా ఇతర శిక్షణ సంస్థల ను, వైద్య సంస్థల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆయన వెల్లడించారు.

ఉత్తర్ ప్రదేశ్ లో నిర్మాణం లో ఉన్న డిఫెన్స్ కారిడార్ సైతం ఇక్కడ కొత్త గా ఉద్యోగ అవకాశాల ను కొనితెస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. యుపి లోని ఈ మౌలిక సదుపాయాల కల్పన సంబంధి పనులు భవిష్యత్తు లో ఆర్థిక వ్యవస్థ ను సరికొత్త శిఖరాల కు చేర్చుతాయని ఆయన అన్నారు.

ఒక ఇంటి ని నిర్మించాలి అని ఒక వ్యక్తి గనక అనుకొంటే మొదట గా ఆ వ్యక్తి లో రహదారుల ను గురించిన ఆందోళన మొదలవుతుంది. ఆ వ్యక్తి అక్కడి నేల ఎలా ఉంది అని ఆరా తీయడం జరుగుతుంది. అంతేకాకుండా, ఇతర అంశాల ను కూడా లెక్క లోకి తీసుకొంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ లో సంధానం గురించి బెంగ ను పెట్టుకోకుండానే పారిశ్రామికీకరణ తాలూకు స్వప్నాల ను చాలా కాలం పాటు చూపెట్టినటువంటి ప్రభుత్వాల ను మనం చూశాం. జరూరైన సదుపాయాలు కొరవడిన కారణం గా ఇక్కడ ఉన్నటువంటి అనేక కర్మాగారాలు మూతపడటం జరిగింది. ఈ పరిస్థితుల లో అటు దిల్లీ లోను, ఇటు లఖ్ నవూ లోను వంశాలదే ఆధిపత్యం కావడం కూడా దురదృష్టకరం. ఏళ్ళకేళ్ళు కుటుంబ సభ్యుల యొక్క ఈ భాగస్వామ్యం ఉత్తర్ ప్రదేశ్ ఆకాంక్షల ను నలగగొట్టింది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రస్తుతం, యుపి లో డబల్ ఇంజిన్ గవర్నమెంటు ఉత్తర్ ప్రదేశ్ లోని సామాన్య ప్రజల ను తన కుటుంబం గా భావిస్తూ కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త కొత్త కర్మాగారాల కోసం అనువైనటువంటి పరిసరాల ను ఏర్పరచడం జరుగుతోంది. ఈ దశాబ్ది అవసరాల ను దృష్టి లో పెట్టుకొని ఒక సమృద్ధమైనటువంటి ఉత్తర్ ప్రదేశ్ ను ఆవిష్కరించడం కోసం మౌలిక సదుపాయాల ను నిర్మించడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

కరోనా సంబంధి టీకాకరణ కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చేసిన శ్రేష్ఠమైన పని ని కూడా ప్రధాన మంత్రి కొనియాడారు. భారతదేశం లో తయారు చేసిన టీకా మందు కు వ్యతిరేకం గా ఎలాంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించనందుకు గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రజల ను ఆయన ప్రశంసించారు.

ఉత్తర్ ప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం రాత్రనక పగలనక కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. సంధానం తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లో మౌలిక సదుపాయాల కల్పన కు కూడా పెద్ద పీట వేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు. కేవలం రెండు సంవత్సరాల లో యుపి ప్రభుత్వం దాదాపు గా 30 లక్షల గ్రామీణ కుటుంబాల కు గొట్టపు మార్గం ద్వారా తాగునీటి సౌకర్యాన్ని సమకూర్చింది అని ఆయన తెలిపారు. మరి ఈ సంవత్సరం లక్షల కొద్దీ సోదరీమణుల కు వారి ఇళ్ళ వద్దకే తాగునీటి ని గొట్టపు మార్గం ద్వారా అందించాలి అని డబల్ ఇంజిన్ గవర్నమెంటు పూర్తి స్థాయి నిబద్ధత తో ఉంది అని ఆయన అన్నారు. సేవ తాలూకు స్ఫూర్తి తో దేశ నిర్మాణం లో తలమునకలు కావాలి అనేది మా కర్తవ్యం, మేము ఇదే పని ని చేస్తాం అని ఆయన అన్నారు.

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions