ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని రెడ్ హౌస్‌లో ట్రినిడాడ్ టొబాగో రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాతో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

 

వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, డిజిటల్ పరివర్తన, యూపీఐ, సామర్థ్యాలను మెరుగుపరచడం, సంస్కృతి, క్రీడలు, ప్రజల అనుసంధానత సహా అనేక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరుదేశాల భాగస్వామ్యంలో అభివృద్ధిపరమైన సహకారం ఒక కీలక భాగం.. ట్రినిడాడ్ టొబాగోలో భారత ప్రధానమంత్రి చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి బిసేసా పేర్కొన్నారు.

ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ, సైబర్ భద్రత వంటి సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సహకారం అవసరమని వారు పిలుపునిచ్చారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రజలకు టీ అండ్ టీ అందించిన బలమైన మద్దతు, సంఘీభావాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. అన్ని ఉగ్రవాద రూపాలు, వ్యక్తీకరణలపై పోరాడటం పట్ల తమ నిబద్ధతను ఇరువురు నేతలూ పునరుద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మరింత సంఘీభావం కోసం, భారత్-సీఏఆర్ఐసీఓఎమ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయడానికి వారు అంగీకరించారు.

 

చర్చల అనంతరం ఫార్మసీ, సత్వర ప్రభావం గల ప్రాజెక్టులు, సంస్కృతి, క్రీడలు, దౌత్యపరమైన శిక్షణ, హిందీ.. భారతీయ అధ్యయనాల కోసం ఐసీసీఆర్ అధ్యయన కేంద్రాలకు సంబంధించిన ఆరు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నారు. టీ అండ్ టీలో భారత సంతతికి చెందిన ఆరో తరం ప్రజలకు ఓసీఐ కార్డు అందించడం సహా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే దిశగా పలు ప్రకటనలు చేశారు. కుదిరిన ఒప్పందాల జాబితాను ఇక్కడ చూడవచ్చు.
ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసాను భారత్‌లో పర్యటించాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా.. ఆమె దానికి అంగీకరించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధానమంత్రి చారిత్రక పర్యటన ఇరు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాలకు ఊతమిచ్చింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort

Media Coverage

‘Give mothers, sisters their due rights’: PM Modi pushes for women's reservation from the ramparts of Red Fort
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 ఆగష్టు 2026
August 16, 2026

Aatmanirbhar Ambitions Meet Global Alliances: The Modi Doctrine in Action