దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాతా రాణి దివ్య నవరూప ఆరాధన ప్రాశస్త్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. దీంతోపాటు మాతపై ఓ భక్తి గీతాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“నవరాత్రి వేడుకలలో భాగంగా మాతా రాణి పావన నవ రూపారాధనలో భక్తజనులందరూ అలౌకికానందంతో పరవశులవుతారు. ఈ నేపథ్యంలో మాతాస్తుతితో మనను మంత్రముగ్ధులను చేసేలా ఆలపించిన ఈ గీతం వింటూ మీరంతా ఆ దేవత ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
नवरात्रि में माता रानी के नौ स्वरूपों की उपासना उनके साधकों को भक्ति-भाव से भर देती है। देवी मां की स्तुति में समर्पित यह भजन मंत्रमुग्ध करने वाला है।https://t.co/qUD0pY1DpI
— Narendra Modi (@narendramodi) April 5, 2025


