నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన తన అభిప్రాయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. అంబ మాత పట్ల భక్తి ప్రపత్తులు మదిని అనంత శాంతితో, ఉత్సాహంతో నింపేసే తీరును ఆయన ప్రస్తావించారు. అంబ మాతను స్తుతిస్తున్న ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘నవరాత్రిలో వాతావరణం అంబా మాత పట్ల భక్తితో తడిసిపోయి మనస్సును అనంత శాంతితోనూ, ఉత్సాహంతోనూ నింపేస్తుంది. మాతకు సమర్పితమైన శ్రద్ధ, విశ్వాసాల ప్రతిధ్వనులు హృదయాన్ని స్పందింపచేస్తాయి’’ అని పేర్కొన్నారు.
नवरात्रि में मां अम्बे की भक्ति से सराबोर वातावरण मन को असीम शांति और ऊर्जा से भर देने वाला है। माता को समर्पित श्रद्धा और विश्वास की गूंज हृदय को स्पंदित कर जाती है।
— Narendra Modi (@narendramodi) March 20, 2026
https://t.co/P5xXegiGIH


