ఇవాళ సమర్పించిన ఆర్థిక సర్వే, భారతదేశ సంస్కరణల వేగానికి సమగ్ర రూపమని, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ దేశం సాధిస్తున్న స్థిరమైన పురోగతిని ఇది ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. బలమైన స్థూల ఆర్థిక అంశాలు, సుస్థిర వృద్ధి, దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, వ్యాపార దక్షత, మౌలిక సదుపాయాల విస్తరణ పాత్రను ఆర్థిక సర్వే స్పష్టం చేసిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. "రైతులు, ఎంఎస్ఎంఈలు, యువతకు ఉపాధి, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యతను ఈ సర్వే వెల్లడించింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయటానికి, ఉత్పాదకతను పెంచటానికి, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయటానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ని ఇది వివరించింది" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఇవాళ సమర్పించిన ఆర్థిక సర్వే, భారతదేశ సంస్కరణల వేగానికి సమగ్ర రూపం. అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లున్నప్పటికీ దేశం సాధిస్తున్న స్థిరమైన పురోగతిని ఇది ప్రతిబింబిస్తుంది. బలమైన స్థూల ఆర్థిక అంశాలు, సుస్థిర వృద్ధి.. దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, వ్యాపార దక్షత, మౌలిక సదుపాయాల విస్తరణ పాత్రను ఇది స్పష్టం చేసింది. రైతులు, ఎంఎస్ఎంఈలు, యువతకు ఉపాధి, సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యతను ఈ సర్వే వెల్లడించింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయటానికి, ఉత్పాదకతను పెంచటానికి, వికసిత్ భారత్ దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయటానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ని వివరించింది.

ఈ నివేదికలోని లోతైన సమాచారం, విధాన రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తుంది. భారత ఆర్థిక భవిష్యత్తుపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది".

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi at BRICS summit: Dismantle ‘pyramid of privilege’ to make Global South a ‘rule-shaper’

Media Coverage

PM Modi at BRICS summit: Dismantle ‘pyramid of privilege’ to make Global South a ‘rule-shaper’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 సెప్టెంబర్ 2026
September 12, 2026

President Putin, Partners, and a Photograph: How PM Modi Turned BRICS Into India’s Showcase

16 Crore Domestic Flyers. ₹22 Lakh Crore Tourism. The Holiday Stayed Home.