గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులన్నింటికీ మూలాధారమని స్పష్టం చేశారు. అంత్యోదయ ఆశయంతో మన ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందని, దశాబ్దాలుగా వెనకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ ప్రయత్నమని ప్రధానమంత్రి తెలిపారు.

జన్‌ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ నుంచి స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్‌జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాల లక్ష్యం.. ప్రజలకు గౌరవాన్ని, అవకాశాలను అందించటమేనని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించటం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ వేదికల ద్వారా నేరుగా, పారదర్శకంగా ప్రజలకు సహాయం అందుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. దీని వల్ల అవినీతి, మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడిందని.. సామర్థ్యం, సుపరిపాలనపై విశ్వాసం పెరిగాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ విధంగా గరీబ్ కళ్యాణ్ ప్రయాణం ప్రజా ఉద్యమంగా మారిందని.. ఇది ప్రజల సాధికారతకు, వికసిత్ భారత్ కలని సాకారం చేసుకునేందుకు దోహదపడుతుందని అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచింది. పేదలు, వెనకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులకు మూలం. మేం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితో పనిచేశాం. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే మా నిరంతర ప్రయత్నం. ప్రజలకు గౌరవాన్ని, అవకాశాలను అందించటమే.. జన్‌ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ నుంచి స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్‌జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాల లక్ష్యం.

12YearsOfGaribKalyan”

"పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించటం సంతోషకరం. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ వేదికల ద్వారా నేరుగా, పారదర్శకంగా ప్రజలకు సహాయం అందుతోంది. దీనివల్ల అవినీతి, మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడటమే కాక.. సామర్థ్యం పెరిగి, సుపరిపాలనపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. ఈ విధంగా గరీబ్ కళ్యాణ్ ప్రయాణం.. ప్రజల సాధికారతకు, వికసిత్ భారత్ కలని సాకారం చేసే దిశగా ప్రజా ఉద్యమంగా మారింది.

12YearsOfGaribKalyan"

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional