ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క విశ్వవిద్యాలయాలు మరింత గుర్తింపు ను తెచ్చుకొంటూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నాణ్యత కలిగిన విద్య మరియు వృద్ధి, ఇంకా నూతన ఆవిష్కరణల అవకాశాల ను అందించాలన్నది ప్రభుత్వం యొక్క నిబద్ధత గా ఉంది అని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటించారు.
టైమ్స్ హయర్ ఎడ్యుకేశన్ లో చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆపీసర్ గా ఉన్న శ్రీ ఫిల్ బైటీ ఎక్స్ లో పొందుపరచిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ -
‘‘ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క విశ్వవిద్యాలయాలు పురోగమిస్తూ ఉండడం చూస్తే ఎంతో బాగుంది అని అనిపించింది. నాణ్యమైన విద్య ను అందించాలన్న విషయం లో మా నిబద్ధత తాలూకు ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మేము మా యొక్క విద్య సంస్థల కు సమర్థన ను ఇవ్వడాన్ని కొనసాగిస్తాం; అంతేకాదు, వృద్ధి కి అవకాశాల ను మరియు నూతన ఆవిష్కరణల కు అవకాశాల ను కల్పిస్తాం. దీనితో మా యువతీ యువకుల కు అత్యధిక సహాయం లభిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
Great to see India's universities making strides on the global stage! Our commitment to quality education is yielding encouraging results. We will continue to support our educational institutions and provide opportunities for growth and innovation. This will help our youth… https://t.co/3uRGU79KiK
— Narendra Modi (@narendramodi) June 27, 2024


