భారత్‌లో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రపంచ వ్యాప్త నేతలూ, నూతన ఆవిష్కర్తలతో పాటు నిపుణులు కూడా తరలివస్తుండడం ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. ఈ కార్యక్రమం అమిత ప్రాధాన్యం ఉన్న ఘట్టమని ప్రధాని చెబుతూ, ఈ శిఖరాగ్ర సదస్సు భారత యువతలో ఉట్టిపడుతున్న అపార దక్షతనీ, ప్రపంచ సాంకేతిక రంగంలో అంతకంతకూ ఎదుగుతున్న మన దేశ స్థాయినీ స్పష్టంగా ప్రతిబింబిస్తోందన్నారు.
సంస్కృత భాషలో ఓ ప్రాచీన శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పొందుపరుస్తూ -
‘‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ పలువురు భారత్‌కు విచ్చేస్తుండటం మనకు ఎంతో గర్వకారణం. దీనితో మన దేశ యువత సామర్థ్యం కూడా స్పష్టమవుతోంది. మన దేశం సైన్స్, టెక్నాలజీ రంగంలో వేగంగా పురోగమిస్తోందనీ, ప్రపంచ అభివృద్ధిలో కీలక తోడ్పాటును అందిస్తోందనీ ఈ సందర్భం తెలియజేస్తోంది.
దానే తపసి శౌచం చ విజ్ఞానం వినయే నయే
విస్మయో న హి కర్తవ్యో బహురత్నా వసున్దరా’’ అని పేర్కొన్నారు.
यह हमारे लिए अत्यंत गर्व की बात है कि India AI Impact Summit के लिए दुनियाभर से लोग भारत आ रहे हैं। इससे हमारे देश के युवाओं के सामर्थ्य का भी पता चलता है। यह अवसर इस बात का भी प्रमाण है कि हमारा देश विज्ञान और टेक्नोलॉजी के क्षेत्र में तेजी से प्रगति कर रहा है और वैश्विक विकास… pic.twitter.com/7gxXJEtpOz
— Narendra Modi (@narendramodi) February 16, 2026


