ప్రజలకు ప్రాతినిధ్యం వహించడంలోని సారాన్ని చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్
నాత్మప్రియం ప్రియం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం ప్రియమ్’’.
‘‘ప్రజల సుఖంలోనే ప్రజల ప్రతినిధి సుఖం కూడా ఇమిడిపోయి ఉంటుంది. వారికి ఏది హితమో అదే ఆ ప్రజా ప్రతినిధికీ హితమవుతుంది. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి తనకంటూ ప్రియమైన విషయాలేవీ వేరుగా ఉండవు. ప్రజలకు ప్రియమైందే ప్రజాప్రతినిధికీ ప్రీతిని కలిగిస్తుంది’’ అని మనకు ఈ సుభాషితం సూచిస్తోంది.
ఈ రోజు పంచాయతీ రాజ్ దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్త ప్రజా ప్రతినిధులకు శ్రీ మోదీ అభినందనలను తెలియజేశారు. ‘‘ ప్రజలకు సేవ చేయాలన్న, దేశానికి సేవలందించాలన్న మీ అంకిత భావం మాకందరికీ నిజంగానే స్ఫూర్తిని ఇస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘పంచాయతీ రాజ్ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్త ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవతో పాటు దేశసేవ పట్ల మీరంతా కనబరుస్తున్న అంకిత భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తోంది.
‘‘ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్
నాత్మప్రియం ప్రియం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం ప్రియమ్’’ అని పేర్కొన్నారు.
पंचायती राज दिवस के अवसर पर देशभर के जनप्रतिनिधियों का हार्दिक अभिनंदन! जनसेवा के साथ राष्ट्रसेवा के प्रति आप सभी का समर्पण हर किसी को प्रेरित करने वाला है।
— Narendra Modi (@narendramodi) April 24, 2026
प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्।
नात्मप्रियं प्रियं राज्ञः प्रजानां तु प्रियं प्रियम्॥ pic.twitter.com/gb0K3Rr709


