విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సృష్టిలో కీలక పాత్రను పోషించిన మహనీయుడిని విశేషంగా ఆరాధించడానికి ఈ పవిత్ర దినాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా, నవీన సృజనలో నిమగ్నమైన కర్మయోగులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ రోజు ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశం నలు మూలలా ఉన్న నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. సృష్టిలో కీలక పాత్రను పోషించిన మహనీయుడిని విశేషంగా ఆరాధించడానికి ఈ పవిత్ర దినాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా నవీన సృజనలో నిమగ్నమైన కర్మయోగులందరికీ నేను నా మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. భరతవర్షాన్ని సుదృఢంగా, సమృద్ధంగా, సమర్థమైందిగా తీర్చిదిద్దడంలో మీ ప్రతిభ, మీ కష్టించే తత్వం అమూల్యమైన పాత్రను పోషిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
देशभर के अपने परिवारजनों को भगवान विश्वकर्मा जयंती की हार्दिक शुभकामनाएं। सृष्टि के शिल्पकार की विशेष आराधना के इस पावन अवसर पर नवसृजन में जुटे सभी कर्मयोगियों को मेरा हृदय से अभिनंदन। आपकी प्रतिभा और परिश्रम सशक्त, समृद्ध और समर्थ भारतवर्ष के निर्माण में बहुत मूल्यवान है।
— Narendra Modi (@narendramodi) September 17, 2025


