హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సుసంపన్నమైన సంప్రదాయాలు, అద్వితీయమైన సాంస్కృతిక వారసత్వం, ఇక్కడి ప్రజలకున్న శ్రద్ధ, కర్తవ్య భావం, వినయం కారణంగా ఈ పవిత్ర దేవభూమి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రధానమంత్రి అన్నారు.
ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హిమాచల్ దివస్ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. సుసంపన్నమైన సంప్రదాయాలు, అద్వితీయమైన సాంస్కృతిక వారసత్వం, ఇక్కడి ప్రజల కృషి, కర్తవ్య భావన, వినయం కారణంగా ఈ పావన దేవభూమికి విశేషమైన గుర్తింపు లభించింది. ఈ శుభ సందర్భంగా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’.
समस्त हिमाचलवासियों को हिमाचल दिवस की हार्दिक शुभकामनाएं। यह पावन देवभूमि अपनी समृद्ध परंपराओं, अनुपम सांस्कृतिक धरोहर और यहां के लोगों की कर्मठता, कर्तव्यनिष्ठा और विनम्रता के कारण विशेष पहचान रखती है। इस पुनीत अवसर पर मैं प्रदेश के सभी परिवारजनों के उज्ज्वल भविष्य की कामना करता…
— Narendra Modi (@narendramodi) April 15, 2026


