కార్గిల్ విజయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “దేశ ప్రతిష్ఠ పరిరక్షణలో జీవితాలను త్యాగం చేసిన భరతమాత సాహపుత్రుల అసమాన శౌర్యపరాక్రమాలను సర్మించుకోవాల్సిన సందర్భమిది” అని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. మాతృభూమి ఆత్మగౌరవ పరిరక్షణలో జీవితాన్నే పణంగా పెట్టిన భరతమాత సాహస పుత్రుల అకుంఠిత దీక్ష, శౌర్యపరాక్రమాలను ఈ రోజున మన స్ఫురణకు వస్తాయి. జన్మభూమి కోసం ప్రాణార్పణకు వెనుదీయని వారి దేశభక్తి తరతరాలకూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. జై హింద్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
देशवासियों को कारगिल विजय दिवस की ढेरों शुभकामनाएं। यह अवसर हमें मां भारती के उन वीर सपूतों के अप्रतिम साहस और शौर्य का स्मरण कराता है, जिन्होंने देश के आत्मसम्मान की रक्षा के लिए अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के लिए मर-मिटने का उनका जज्बा हर पीढ़ी को प्रेरित करता रहेगा। जय…
— Narendra Modi (@narendramodi) July 26, 2025


