షేర్ చేయండి
 
Comments
Processing Industry related to value addition to agri products is our priority: PM
Private Investment in Agriculture will help farmers: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర లోని సంగోలా నుంచి పశ్చిమ బంగాల్ లోని శాలిమార్ కు న‌డిచే వందో కిసాన్ రైలు కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజున జెండా ను చూపి, ఆ రైలును ప్రారంభించారు.  ఈ సంద‌ర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌, శ్రీ పీయూష్ గోయ‌ల్ లు కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, దేశ రైతుల ఆదాయాన్ని పెంచే దిశ‌లో కిసాన్ రైలు స‌ర్వీసు ఒక పెద్ద అడుగు అని అభివ‌ర్ణించారు.  క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో సైతం గ‌త నాలుగు నెల‌ల లో 100 కిసాన్ రైళ్ళ‌ను ప్రారంభించ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.  ఈ విధ‌మైన సేవ వ్య‌వ‌సాయానికి సంబంధించిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ లో ఒక పెద్ద మార్పును కొని తెస్తుంద‌ని, అంతేకాకుండా దేశ శీత‌లీక‌ర‌ణ స‌దుపాయం క‌లిగిన స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ తాలూకు శ‌క్తిని కూడా పెంచుతుంద‌ని ఆయ‌న అన్నారు.  కిసాన్ రైలు ద్వారా స‌ర‌కుల చేర‌వేత‌కు ఎలాంటి క‌నీస రాశి నిబంధ‌న‌ను ఖ‌రారు చేయ‌లేద‌ని, అత్యంత చిన్న ప‌రిమాణంలో ఉండే ఉత్ప‌త్తి కూడా త‌క్కువ ధ‌ర‌కు పెద్ద బ‌జారుకు స‌రైన విధంగా చేర‌గ‌లుగుతుంద‌ని కూడా ఆయ‌న అన్నారు.

కిసాన్ రైలు ప‌థ‌కం రైతుల‌కు సేవ చేయాల‌న్న ప్ర‌భుత్వ వ‌చ‌నబ‌ద్ధ‌త‌ను చాట‌డం ఒక్క‌టే కాకుండా, మ‌న రైతులు కొత్త బాధ్య‌త‌ల‌ను అందుకోవ‌డానికి ఎంత వేగంగా స‌న్న‌ద్ధులు అవుతార‌నే దానికి కూడా ఒక నిద‌ర్శ‌నంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  రైతులు వారి పంట‌ల‌ను ప్ర‌స్తుతం ఇత‌ర రాష్ట్రాల‌ లో కూడా అమ్ముకోగ‌లుగుతార‌ని, ఈ ప్ర‌క్రియ‌లో కిసాన్ రైల్ తో పాటు, వ్యావ‌సాయ‌క విమానాలు (కృషి ఉడాన్‌)ల‌వి ప్ర‌ధాన పాత్ర అని ఆయ‌న చెప్పారు.  కిసాన్ రైలు అంటే అది త్వ‌ర‌గా పాడ‌యిపోయే ఫ‌లాలు, కాయ‌గూర‌లు, పాలు, చేప‌ల వంటి స‌ర‌కుల‌ను పూర్తి భ‌ద్ర‌త‌తో చేర‌వేసే ఒక చల‌న‌శీల శీత‌లీక‌ర‌ణ నిల‌వ స‌దుపాయం అని ఆయ‌న అన్నారు.  ‘‘భార‌త‌దేశం లో ఒక పెద్ద రైల్వే నెట్ వ‌ర్క్ స్వాతంత్య్రం రావ‌డానికంటే ముందు నుంచీ ఉంది.  శీత‌లీక‌ర‌ణ నిల‌వ సంబంధిత సాంకేతిక విజ్ఞానం కూడా అందుబాటులో ఉంది.  ప్ర‌స్తుతం ఈ బ‌లాన్ని కిసాన్ రైల్ మాధ్య‌మం ద్వారా స‌రైన విధంగా వినియోగించుకోవ‌డం జ‌రుగుతోంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కిసాన్ రైలు వంటి స‌దుపాయం ప‌శ్చిమ బంగాల్ కు చెందిన ల‌క్ష‌ల కొద్దీ చిన్న రైతుల‌కు ఒక భారీ సౌక‌ర్యంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ సౌక‌ర్యం అటు రైతుల‌కు, ఇటు స్థానికంగా చిన్న వ్యాపార‌స్తుల‌కు కూడా అందుబాటులో ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  ఇత‌ర దేశాల‌కు చెందిన వ్య‌వ‌సాయ‌రంగ నిపుణుల‌తో పాటు, అక్క‌డి కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని భార‌త‌దేశ వ్య‌వ‌సాయరంగం లోకి తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న అన్నారు.

రైల్వే స్టేష‌న్ల ప‌రిస‌రాల లో పెరిశ‌బుల్‌ రైల్ కార్గో సెంట‌ర్ల‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంది.  వాటిలో రైతులు వారి ఉత్ప‌త్తిని నిల‌వ చేసే వీలు ఉంటుంది.  వీలైన‌న్ని ఎక్కువ పండ్ల‌ను, కాయ‌గూర‌ల‌ను కుటుంబానికి అందించాల‌న్న‌దే ఈ ప్ర‌య‌త్నంగా ఉంది.  అద‌న‌పు ఉత్ప‌త్తి ర‌సం, ప‌చ్చ‌డి, సాస్‌, చిప్స్ వ‌గైరాల‌ను ఉత్ప‌త్తి చేసే న‌వ పారిశ్రామికుల చెంత‌కు చేరాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

నిల‌వ సౌకర్యంతో కూడిన మౌలిక స‌దుపాయాల‌ను, ప్రోసెసింగ్ ప‌రిశ్ర‌మ‌ల‌కు పెద్ద‌పీట వేయాలి అనేదే ప్ర‌భుత్వ ప్రాధ‌మ్యంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ఆ త‌ర‌హా ప‌థ‌కాల‌ను సుమారు 6500 సంఖ్య‌లో మెగా ఫూడ్ పార్క్స్, కోల్డ్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, ఆగ్రో ప్రోసెసింగ్ క్ల‌స్ట‌ర్ ల‌లో భాగంగా ఆమోదించ‌డ‌మైంద‌ని ఆయ‌న అన్నారు.  ఆత్మ నిర్భ‌ర్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ ఆహారశుద్ధి ప‌రిశ్ర‌మ‌ల కోసం 10,000 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేయ‌డ‌మైంది అని ఆయ‌న అన్నారు.  

గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు, రైతులు, యువ‌తీయువ‌కుల భాగ‌స్వామ్యం, స‌మ‌ర్ధ‌న‌లే ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయ‌ని శ్రీ మోదీ అన్నారు.  వ్య‌వ‌సాయ ప్ర‌ధాన వ్యాపారాలు, వ్య‌వ‌సాయ ప్ర‌ధాన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ల‌లో మ‌హిళా స్వ‌యం స‌హాయ స‌మూహాలు వంటి స‌హ‌కార స‌మూహాలు, ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్స్ (ఎఫ్‌పిఒ స్‌) వంటివి ప్రాధాన్యాన్ని పొందుతాయ‌ని ఆయ‌న చెప్పారు.  ఇటీవ‌లి సంస్క‌ర‌ణ‌లు వ్య‌వ‌సాయ సంబంధ వ్యాపారం విస్త‌రించ‌డానికి దారితీస్తాయ‌ని, వాటి తాలూకు అతి పెద్ద ల‌బ్ధిదారులుగా ఈ స‌మూహాలు ఉంటాయ‌ని ఆయ‌న చెప్పారు.  వ్య‌వ‌సాయ రంగంలో ప్రైవేటు పెట్టుబ‌డి ఈ స‌మూహాల‌కు స‌హాయం అందించాల‌న్న ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నానికి మ‌ద్ధ‌తుగా ఉండ‌గ‌ల‌ద‌ని ఆయ‌న చెప్పారు.  “మేము భార‌త‌దేశ వ్య‌వ‌సాయ రంగాన్ని ప‌టిష్టం చేసే మార్గంలో ముందుకు సాగిపోతూనే ఉంటాము” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

Click here to read full text speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
9,200 oxygen concentrators, 5,243 O2 cylinders, 3.44L Remdesivir vials delivered to states: Govt

Media Coverage

9,200 oxygen concentrators, 5,243 O2 cylinders, 3.44L Remdesivir vials delivered to states: Govt
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 మే 2021
May 11, 2021
షేర్ చేయండి
 
Comments

PM Modi salutes hardwork of scientists and innovators on National Technology Day

Citizens praised Modi govt for handling economic situation well during pandemic