ఛఠ్ మహాపర్వంలో భాగంగా చేసుకునే 'ఖర్నా' పూజ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పండగలో కఠోర ఉపవాసాలు, ఆచారాలను పాటించే వారందరికీ గౌరవప్రదంగా నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
ఛఠీ మాతకు సంబంధించిన భక్తీ గీతాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు:
“మీ అందరికీ ఛఠ్ మహాపర్వంలోని ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలు. వ్రతం చేస్తోన్న భక్తులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం. ఈ పవిత్రమైన సందర్భంలో బెల్లంతో చేసిన పాయసంతో పాటు సాత్విక ప్రసాదాన్ని స్వీకరించే సంప్రదాయం ఉంది. ఇది శ్రద్ధ, సంయమనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ పవిత్ర పూజ సందర్భంగా ఛఠీ మాత ప్రతి ఒక్కరికీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.”
https://www.youtube.com/watch?v=mOTEaLwwKK0
https://m.youtube.com/watch?v=fwX2g9jjo1o&pp=0gcJCR4Bo7VqN5tD”
आप सभी को महापर्व छठ की खरना पूजा की असीम शुभकामनाएं। सभी व्रतियों को सादर नमन! श्रद्धा और संयम के प्रतीक इस पावन अवसर पर गुड़ से तैयार खीर के साथ ही सात्विक प्रसाद ग्रहण करने की परंपरा रही है। मेरी कामना है कि इस अनुष्ठान पर छठी मइया हर किसी को अपना आशीर्वाद दें।…
— Narendra Modi (@narendramodi) October 26, 2025


