దేశ ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థిస్తూ సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని

సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రారంభం సందర్భంగా నేడు దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యేళ్లుగా లక్షలాది ప్రజల హృదయాల్లో సోమనాథ్‌ను సజీవంగా నిలిపిన కాలాతీత నాగరికతా స్ఫూర్తిని ఆయన గుర్తుచేసుకున్నారు.

సోమనాథ్ 1026 సంవత్సరం జనవరిలో మొదటి దాడిని ఎదుర్కొందని శ్రీ మోదీ చెప్పారు. తర్వాతి శతాబ్దాల్లోనూ పదేపదే దాడులు జరిగినప్పటికీ.. భక్తుల అచంచలమైన విశ్వాసం, భారతీయ నాగరికతా దృఢ సంకల్పం వల్ల ప్రతీసారి సోమనాథ క్షేత్రం పునర్నిర్మితమై నిలిచింది. “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌ అంటే.. సిద్ధాంతాలు, విలువల విషయంలో ఎన్నడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకోవడమే. పరిస్థితులు ఎంత భీకరంగా ఉన్నప్పటికీ.. వారి సంకల్పం చెక్కుచెదరలేదు. మన సంస్కృతి పట్ల వారి నిబద్ధత ఎంతమాత్రమూ సడలలేదు” అని ఆయన అన్నారు.

గతంలో తన సోమనాథ్ పర్యటనలకు సంబంధించిన మధుర స్మృతులను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. #SomnathSwabhimanParv హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ ప్రజలంతా తమ జ్ఞాపకాలను పంచుకుంటూ, ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 1951లో పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ద్వారాలు నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెరుచుకున్నాయి. ఆ చారిత్రక ఘట్టానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 2001 అక్టోబరు 31న నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, కె.ఎం. మున్షీ, తదితర ప్రముఖులు అత్యంత కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. 2001లో ఆ కార్యక్రమం, సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుకలు ఒకేసారి జరగడం విశేషం. నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, హోం మంత్రి లాల్ కృష్ణ అద్వానీతోపాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

అలాగే 1951లో సోమనాథ ఆలయాన్ని దేశానికి పునరంకితం చేసిన మహత్తర ఘట్టానికి 2026తో 75 ఏళ్లు పూర్తవుతాయని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “ఈ చారిత్రక ఘట్టం ఆలయ పునర్నిర్మాణానికి మాత్రమే సంబంధించింది కాదు.. తరతరాలకు స్ఫూర్తినిస్తూ కొనసాగుతున్న మన నాగరికత అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం” అని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

“జై సోమనాథ్!

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నేడు ప్రారంభమవుతోంది. వెయ్యేళ్ల కిందట.. 1026 జనవరిలో సోమనాథ్ తొలి దాడిని ఎదుర్కొన్నది. 1026 దాడిగానీ, అనంతర దాడులుగానీ లక్షలాది మంది అచంచలమైన విశ్వాసాన్ని ఏమాత్రమూ సడలించలేకపోయాయి. నాగరికతా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేకపోయాయి. ఆ స్ఫూర్తితోనే సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ పునర్నిర్మితమై నిలిచింది.

గతంలో నా సోమనాథ్ పర్యటనల నుంచి కొన్ని చిత్రాలను నేను మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్లి ఉంటే, #SomnathSwabhimanParv హాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ఆ చిత్రాలను అందరితో పంచుకోండి.”

“#SomnathSwabhimanParv అంటే.. సిద్ధాంతాలు, విలువల విషయంలో ఏనాడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకోవడమే. పరిస్థితులు ఎంత భీకరంగా ఉన్నప్పటికీ.. వారి సంకల్పం చెక్కుచెదరలేదు. మన సంస్కృతి పట్ల వారి నిబద్ధత ఎంతమాత్రమూ సడలలేదు.”

“2001 అక్టోబర్ 31న సోమనాథ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలివి. 1951లో పునర్నిర్మించిన సోమనాథ ఆలయ ద్వారాలు.. నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెరచుకున్న మహత్తర ఘట్టానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుక అది. సర్దార్ పటేల్, కె.ఎం. మున్షీ, తదితరుల కృషి అత్యంత ప్రశంసనీయం. అదే సమయంలో సర్దార్ పటేల్ 125వ జయంతి వేడుక కూడా జరిగింది. 2001 నాటి కార్యక్రమానికి నాటి ప్రధానమంత్రి అటల్ గారు, హోంమంత్రి అద్వానీ గారు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

1951 నాటి మహోజ్వల ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి!”

 

 

 

 

“जय सोमनाथ !

सोमनाथ स्वाभिमान पर्व का आज से शुभारंभ हो रहा है। एक हजार वर्ष पूर्व, जनवरी 1026 में सोमनाथ मंदिर ने अपने इतिहास का पहला आक्रमण झेला था। साल 1026 का आक्रमण और उसके बाद हुए अनेक हमले भी हमारी शाश्वत आस्था को डिगा नहीं सके। बल्कि इनसे भारत की सांस्कृतिक एकता की भावना और सशक्त हुई और सोमनाथ का बार-बार पुनरोद्धार होता रहा।

मैं सोमनाथ की अपनी पिछली यात्राओं की कुछ तस्वीरें साझा कर रहा हूं। यदि आप भी सोमनाथ गए हैं, तो अपनी तस्वीरें #SomnathSwabhimanParv के साथ जरूर शेयर करें।”

“#SomnathSwabhimanParv का ये अवसर, भारत माता के उन असंख्य सपूतों को स्मरण करने का पर्व है, जिन्होंने कभी अपने सिद्धांतों और मूल्यों से समझौता नहीं किया। समय कितना ही कठिन और भयावह क्यों ना रहा हो, उनका संकल्प हमेशा अडिग रहा। हमारी सभ्यता और सांस्कृतिक चेतना के प्रति उनकी निष्ठा अटूट रही। अटूट आस्था के एक हजार वर्ष का ये अवसर, हमें राष्ट्र की एकता के लिए निरंतर प्रयासरत रहने की प्रेरणा देता है।”

“मैं 31 अक्टूबर 2001 को सोमनाथ में आयोजित एक कार्यक्रम की कुछ झलकियां भी आपसे साझा कर रहा हूं। यह वो साल था, जब हमने 1951 में पुनर्निर्मित सोमनाथ मंदिर के उद्घाटन के 50 वर्ष पूर्ण होने का उत्सव मनाया था। 1951 में वो ऐतिहासिक समारोह तत्कालीन राष्ट्रपति डॉ. राजेन्द्र प्रसाद जी की मौजूदगी में संपन्न हुआ था। सोमनाथ मंदिर के पुनर्निर्माण में सरदार पटेल और केएम मुंशी जी के साथ ही कई महान विभूतियों के प्रयास अत्यंत उल्लेखनीय रहे हैं। साल 2001 के इस कार्यक्रम में तत्कालीन प्रधानमंत्री अटल जी और गृह मंत्री आडवाणी जी और कई गणमान्य लोग शामिल हुए थे।

वर्ष 2026 में हम 1951 में हुए भव्य समारोह के 75 वर्ष पूर्ण होने का भी स्मरण कर रहे हैं!”

 

 

 

 

Sharing a Sanskrit verse on X, Shri Modi stated:

“श्री सोमनाथ महादेव की कृपा और आशीर्वाद से सबका कल्याण हो।

सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम्।

भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये॥”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
UPI — an eventful journey

Media Coverage

UPI — an eventful journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 ఆగష్టు 2026
August 25, 2026

Nari Shakti to Capital Markets: PM Modi’s Reforms Are Rewiring India’s Growth Story