భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సజీవ గిరిజన సంస్కృతికి ఆలవాలమైన పుణ్యభూమి జార్ఖండ్ అని ఆయన కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా శౌర్య పరాక్రమాలను గుర్తుచేసిన ఆయన..  ధైర్యం, ఆత్మగౌరవం, అలుపెరుగని పోరాటాల స్ఫూర్తిదాయక గాథలతో కూడిన చరిత్ర ఈ పవిత్ర నేలకు ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం.. అభివృద్ధి, సర్వతోముఖ శ్రేయస్సును సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. 

గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవపూర్వక నివాళులు అర్పించారు. పవిత్రమైన ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా.. మాతృభూమి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించడంలో ఆయన చేసిన సాటిలేని కృషిని యావత్ దేశం కృతజ్ఞతతో స్మరించుకుంటోందని ఆయన అన్నారు. విదేశీ పాలనలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా భగవాన్ బిర్సా ముండా చేసిన పోరాటం, త్యాగం భావి తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

“గిరిజన సంస్కృతితో సుసంపన్నమైన అద్భుత రాష్ట్రం జార్ఖండ్ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భగవాన్ బిర్సా ముండా గారు నడయాడిన ఈ నేల చరిత్ర.. ధైర్యం, పోరాటం, ఆత్మగౌరవం వంటి గాథలతో నిండి ఉంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులందరూ పురోగతి, శ్రేయస్సు సాధించాలని నేను కోరుకుంటున్నాను”

“ గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా వారికి నా శతకోటి నమస్సులు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ఆయన చేసిన సాటిలేని కృషిని పవిత్రమైన ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా యావత్ దేశం భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటోంది. విదేశీ పాలనలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, త్యాగం ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.”

 

 

“देश के महान स्वतंत्रता सेनानी भगवान बिरसा मुंडा जी को उनकी 150वीं जयंती पर शत-शत नमन। जनजातीय गौरव दिवस के इस पावन अवसर पर पूरा देश मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उनके अतुलनीय योगदान को श्रद्धापूर्वक स्मरण कर रहा है। विदेशी हुकूमत के अन्याय के खिलाफ उनका संघर्ष और बलिदान हर पीढ़ी को प्रेरित करता रहेगा।”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Beyond Make in India: Building a globally competitive manufacturing ecosystem

Media Coverage

Beyond Make in India: Building a globally competitive manufacturing ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 జూన్ 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance