షేర్ చేయండి
 
Comments

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేశారు. అందరు మంచి ఆరోగ్యం తోను, కులాసాగాను ఉండాలంటూ ఈశ్వరుడి ని ఆయన ప్రార్థించారు. స్వాస్థ్య రంగం తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారందరి కి మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్, ఇంకా పిఎమ్ జన్ ఔషధీ పథకాలు మన పౌరుల కు మంచి నాణ్యత తో కూడినటువంటి మరియు తక్కువ ఖర్చు కే లభించేటటువంటి ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడడం లో ముఖ్య పాత్ర ను పోషిస్తున్నాయి అని ఆయన అన్నారు. గడచిన 8 సంవత్సరాల లో, వైద్య విద్య రంగం లో వేగం గా మార్పులు చోటు చేసుకొన్నాయి. బోలెడన్ని కొత్త వైద్య కళాశాల లు కూడా ఏర్పాటు అయ్యాయి అని ఆయన అన్నారు. అసంఖ్యాక యువత ఆకాంక్షల ను పూర్తి చేసే మార్గం సుగమం అయ్యేటట్లు గా స్థానిక భాష ల లో వైద్య విద్య అధ్యయనాని కి భారత ప్రభుత్వం ఏర్పాటు లు చేస్తోంది అని ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

"ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్

ప్రపంచ ఆరోగ్య దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. అందరి కి మంచి ఆరోగ్యం మరియు శ్రేయం తాలూకు ఆశీర్వాదాలు ప్రాప్తించు గాక. ఈ రోజు స్వాస్థ్య రంగం తో అనుబంధాన్ని కలిగి ఉన్న వారందరికీ కృతజ్ఞతల ను తెలియజేసేటటువంటి రోజు. వారి కఠోర శ్రమే మన భూమి ని సురక్షితం గా ఉంచుతోంది.’’

‘‘భారతదేశం లో ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల ను నిరంతరమూ పెంచడం కోసం భారత ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తున్నది. మన పౌరుల కు మంచి నాణ్యత తో కూడినటువంటి, చౌక గా దొరికేటటువంటి ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడాలి అన్నదే ముఖ్యోద్దేశ్యం గా ఉంది. ప్రపంచం లో అత్యంత భారీ ది అయినటువంటి ఆరోగ్య సంరక్షణ పథకం... ఆయుష్మాన్ భారత్ ను నిర్వహిస్తూ ఉండడం అనేది మన దేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి విషయం.’’

‘‘పిఎమ్ జన్ ఔషధీ వంటి పథకాల లబ్ధిదారుల తో నేను మాటామంతీ జరిపినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం వేస్తుంటుంది. తక్కువ ఖర్చు లోనే లభించే ఆరోగ్య సంరక్షణ పట్ల మేం కట్టబెడుతున్న ప్రాధాన్యం పేదల కు మరియు మధ్య తరగతి కి చెప్పుకోదగిన స్థాయి లో డబ్బు ను ఆదా చేసుకోవడాని కి మార్గాన్ని సుగమం చేసింది. దీనితో పాటు మేం సమగ్ర స్వస్థత కు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడం కసం మన ఆయుష్ నెట్ వర్క్ ను దృఢతరం చేస్తున్నాం.’’

‘‘గత 8 సంవత్సరాల లో, వైద్య విద్య రంగం లో శరవేగం గా మార్పు లు చోటు చేసుకొన్నాయి. చాలా కొత్త వైద్య కళాశాల లు ఏర్పాటు అయ్యాయి. స్థానిక భాషల లో వైద్య విద్య అధ్యయన సౌకర్యాన్ని అందజేయడం కోసం మా ప్రభుత్వం చేస్తున్న ప్రయాస లు లెక్కలేనంత మంది యువతీయువకుల ఆకాంక్షల కు రెక్కల ను అందించగలవు.’’ అని పేర్కొన్నారు.

 

 

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
PM Modi felicitates 11 workers who built new Parliament building, gifts shawls

Media Coverage

PM Modi felicitates 11 workers who built new Parliament building, gifts shawls
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 28th May 2023
May 28, 2023
షేర్ చేయండి
 
Comments

New India Unites to Celebrate the Inauguration of India’s New Parliament Building and Installation of the Scared Sengol

101st Episode of PM Modi’s ‘Mann Ki Baat’ Fills the Nation with Inspiration and Motivation