హర్యానా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
రైతుల అవిశ్రాంత శ్రమ, సైనికుల సాటిలేని పరాక్రమం, యువత అద్భుతమైన విజయాల ద్వారా హర్యానా రాష్ట్రం ఎల్లప్పుడూ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి పథంలో వేగంగా పురోగమిస్తున్న రాష్ట్ర ప్రజలకు సంతోషం, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు:
“హర్యానా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ చారిత్రక నేల రైతు సోదరీసోదరుల అవిశ్రాంత శ్రమ, జవాన్ల సాటిలేని పరాక్రమం, యువత అద్భుతమైన విజయాలతో దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని.. పురోగతి పథంలో వేగంగా ముందుకు సాగుతున్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఉజ్వల భవిష్యత్తుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను."
हरियाणा दिवस के अवसर पर राज्य के सभी निवासियों को बहुत-बहुत बधाई। यह ऐतिहासिक धरती हमारे किसान भाई-बहनों के अथक परिश्रम, जवानों के अतुलनीय पराक्रम और युवाओं के अद्भुत प्रदर्शन से देशभर के लिए एक मिसाल रही है। प्रगति के पथ पर तेजी से आगे बढ़ रहे इस प्रदेश के विशेष अवसर पर मैं हर…
— Narendra Modi (@narendramodi) November 1, 2025


