ఛత్తీస్‌గఢ్ అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతికీ, సంస్కృతికి అంకితమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పురోగతిలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతిభావంతులైన ప్రజల కృషి, వ్యాపార నైపుణ్యాలు వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం 25వ వార్షికోత్సవం సందర్భంగా నా సోదరీసోదరులందరికీ శుభాకాంక్షలు. ప్రకృతికీ, సంస్కృతికి అంకితమైన ఈ రాష్ట్రం పురోగతిలో ఈ రోజు సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన అనేక ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి కోసం పోటీ పడుతున్నాయి. కష్టపడి పనిచేసే తత్వం, నైపుణ్యం కలిగిన ప్రజల అంకితభావం, వ్యాపార నైపుణ్యాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను."
छत्तीसगढ़ के अपने सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की 25वीं वर्षगांठ की अनेकानेक शुभकामनाएं। प्रकृति और संस्कृति को समर्पित यह प्रदेश आज प्रगति के नित-नए मानदंड गढ़ने में जुटा है। कभी नक्सलवाद से प्रभावित रहे यहां के कई इलाके आज विकास की प्रतिस्पर्धा कर रहे हैं। मुझे भरोसा…
— Narendra Modi (@narendramodi) November 1, 2025




