ఉత్తరకాశీలోని ధరాలీలో దుర్ఘటన కారణంగా ప్రభావితులైన వారిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో బాధితులందరూ కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్షించారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీతో శ్రీ మోదీ మాట్లాడి, పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు.
అవసరార్థులకు సకాలంలో సాయం అందించడంలో ఏ ప్రయత్నాన్నీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని హామీ ఇచ్చారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘ఉత్తరకాశీలోని ధరాలీలో జరిగిన ఈ దుర్ఘటనతో ప్రభావితులైన వారిపట్ల నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. బాధితులందరూ కోలుకోవాలని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి పుష్కర్ ధామీ గారితో మాట్లాడి, పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నా. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రక్షణ, సహాయక బృందాలు చేతనైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ప్రజలకు అండదండలు అందించడంలో ఏ రకంగానూ వెనుకంజ వేయడం అనే ప్రసక్తే లేదు.
@pushkardhami”
उत्तरकाशी के धराली में हुई इस त्रासदी से प्रभावित लोगों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। इसके साथ ही सभी पीड़ितों की कुशलता की कामना करता हूं। मुख्यमंत्री पुष्कर धामी जी से बात कर मैंने हालात की जानकारी ली है। राज्य सरकार की निगरानी में राहत और बचाव की टीमें हरसंभव…
— Narendra Modi (@narendramodi) August 5, 2025


