దేశ నిర్మాణంలో యువత చురుగ్గా పాల్గొన్నప్పుడు, దేశం వేగవంతమైన అభివృద్ధితో ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతుంది: ప్రధాన మంత్రి
నేడు భారత యువత తమ అంకితభావం, సృజనాత్మకత ద్వారా మనకు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారు: ప్రధాన మంత్రి
'భారత్‌లో తయారీ'ని ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక ఉత్పత్తులను రూపొందించే అవకాశాన్ని భారత యువతకు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తయారీ రంగ మిషన్‌ను ప్రకటించింది: ప్రధాని
తయారీ రంగ మిషన్ దేశవ్యాప్తంగా లక్షలాది ఎంఎస్ఎంఈలు, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది: ప్రధాని
ముంబయి త్వరలో ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు (వేవ్స్) 2025 కు ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ యువతే ప్రధానాంశంగా యువ సృష్టికర్తలకు ఇటువంటి వేదికను ఈ కార్యక్రమం మొదటిసారి అందిస్తోంది: ప్రధాన మంత్రి
మీడియా, గేమింగ్, వినోద రంగాల్లో రంగాల్లో ఆవిష్కర్తలు.. తమ ప్రతిభను ప్రదర్శించడానికి వేవ్స్ అపూర్వ అవకాశం: ప్రధాని
ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అంతరిక్షం, శాస్త్ర విజ్ఞానం వంటి రంగ

ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

"ఏ దేశ పురోగతికైనా, విజయానికైనా పునాది దాని యువతలోనే ఉంటుంది. యువత జాతి నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నప్పుడు, దేశం వేగవంతమైన అభివృద్ధితో ప్రపంచ వేదికపై గుర్తింపును పొందుతుంది" అని ప్రధానంగా వ్యాఖ్యానించారు. భారత యువత తమ కృషి, ఆవిష్కరణల ద్వారా మన అపారమైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని.. దేశ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం అన్ని వేళలా కృషి చేస్తోందన్నారు. స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయన్నారు. వీటి ద్వారా భారత యువత తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం ఒక బహిరంగ వేదికను అందిస్తోంది. వీటన్నింటి ఫలితంగా ఈ దశాబ్దంలో భారత యువత సాంకేతికత, డేటా, ఆవిష్కరణలలో దేశాన్ని అగ్రగామిగా నిలిపారని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ, ఓఎన్‌డీసీ, జీఈఎం (గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్) వంటి ప్లాట్‌ఫామ్‌.. యువత ఎలా నాయకత్వం వహిస్తున్నారో తెలియజేస్తోందన్నారు. తక్షణ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉందని, ఈ ఘనతలో ఎక్కువ భాగం యువతకు దక్కుతుందన్నారు.

 

'ఈ బడ్జెట్‌లో ప్రకటించిన తయారీ రంగ మిషన్ 'భారత్‌లో తయారీ' కార్యక్రమాన్ని ప్రోత్సహించడం.. భారత యువతకు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక ఉత్పత్తులను తయారు చేసే అవకాశాలను అందించాలన్న లక్ష్యంతో ఉంది. ఈ మిషన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎంఎస్ఎమ్ఈలు, చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని ఐఎంఎఫ్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఈ వృద్ధికి అనేక కారణాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరగడం అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. ఇటీవలి కాలంలో వాహన రంగం, పాదరక్షల పరిశ్రమలు.. ఉత్పత్తి, ఎగుమతుల్లో కొత్త రికార్డులు నమోదు చేశాయని, ఇవి యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు తొలిసారిగా రూ. 1.70 లక్షల కోట్ల ఆదాయాన్ని అధిగమించాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించాయని ఆయన వివరించారు. 2014కు ముందు కేవలం 18 మిలియన్ టన్నుల సరుకు మాత్రమే అంతర్గత జలమార్గాల ద్వారా రవాణా అయ్యేదని.. ఈ ఏడాది అది 145 మిలియన్ టన్నులకు చేరినట్లు తెలిపారు. ఈ విజయానికి భారత్ అనుసరిస్తోన్న స్థిరమైన విధానాలు, నిర్ణయాలే కారణమని ఆయన పేర్కొన్నారు. దేశంలో జాతీయ జలమార్గాల సంఖ్య కేవలం 5గా ఉండేదని, అది 110కి పెరిగిందని తెలిపారు. ఈ జలమార్గాల పొడవు సుమారు 2,700 కిలోమీటర్ల నుంచి దాదాపు 5,000 కిలోమీటర్లకు చేరుకుందని వివరించారు. ఈ విజయాలన్నీ దేశవ్యాప్తంగా యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 

 

ముంబయి త్వరలో ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు (వేవ్స్) 2025కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం యువతను ప్రధానాంశంగా పరిగణిస్తోంది. యువ సృష్టికర్తలకు మొట్టమొదటిసారిగా ఇలాంటి వేదికను అందిస్తోంది. మీడియా, గేమింగ్, వినోద రంగాల్లోని ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ సదస్సు అపూర్వ అవకాశాన్ని కల్పిస్తుంది'' అని ప్రధాని అన్నారు. వినోద రంగ అంకురాలకు పెట్టుబడిదారులు, పరిశ్రమలో నాయకత్వ స్థాయి వ్యక్తులతో అనుసంధానం అయ్యే అవకాశం ఈ కార్యక్రమంలో ఉంటుందని.. తమ ఆలోచనలను ప్రపంచానికి తెలియజేసేందుకు ఇది అతిపెద్ద వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే వివిధ వర్క్‌షాప్‌ల ద్వారా యువత కృత్రిమ మేధ, ఎక్స్‌ఆర్, ఇమ్మర్సివ్ మీడియాపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు. "భారత డిజిటల్ కంటెంట్ భవిష్యత్తుకు వేవ్స్ ఉత్తేజాన్ని తీసుకొస్తుంది" అని ఆయన అన్నారు. భారత యువతలో ఉన్న సమ్మిళితత్వాన్ని కొనియాడిన ఆయన.. దేశ సాధిస్తోన్న విజయాలకు సమాజంలోని ప్రతి వర్గం తమ వంతు సహకారం అందిస్తోందన్నారు. ఇటీవల యూపీఎస్సీ ఫలితాల్లో తొలి రెండు స్థానాలను మహిళలే దక్కించుకున్నారని, అగ్రస్థానాల్లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు మహిళలే అన్న ఆయన.. భారత ఆడపడుచులు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. “ప్రభుత్వ ఉద్యోగాల నుంచి అంతరిక్షం, శాస్త్ర విజ్ఞానం వంటి రంగాల్లో మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. స్వయం సహాయక బృందాలు, బీమా సఖీ, బ్యాంక్ సఖీ, కృిషి సఖి వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళల సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్యక్రమాలు కొత్త అవకాశాలను సృష్టించాయి" అని వ్యాఖ్యానించారు. వేలాది మంది మహిళలు ఇప్పుడు డ్రోన్ దీదీలుగా పనిచేస్తున్నారని.. వారి కుటుంబాలు, గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని తెలిపారు. దేశంలో 90 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలు క్రియాశీలకంగా ఉన్నాయని, ఇందులో 10 కోట్లకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బృందాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచిందన్నారు. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ముద్రా యోజన ద్వారా అత్యధికంగా లబ్దిపొందుతున్నది మహిళలేనని.. దేశంలోని 50,000 అంకురాల్లో మహిళలే డైరెక్టర్లుగా ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. అన్ని రంగాలలో ఇటువంటి పరివర్తనాత్మక మార్పులు అభివృద్ధి విషయంలో భారత్ ‌సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని.. ఉపాధి, స్వయం ఉపాధికి మరిన్ని అవకాశాలను సృష్టిస్తున్నాయని వివరించారు. 

ఇవాళ నియామక పత్రాలు అందుకున్న యువతనుద్దేశించి మాట్లాడుతూ.. సాధించిన ఉద్యోగాలు వారి కృషి, అంకితభావం ఫలితమని ప్రధానంగా చెప్పారు. తమ జీవితంలోని తదుపరి దశలను తమ సొంతానికే కాకుండా దేశానికి అంకితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్ఘాటించారు. ప్రజాసేవ చేయాలనే స్ఫూర్తికి పెద్దపీట వేయాలని సూచించారు. తమ కర్తవ్యం పట్ల అత్యంత గౌరవంతో పనిచేసినప్పుడు.. వారి చేస్తున్న పనికి దేశాన్ని కొత్త దిశలో నడిపించే శక్తి వస్తుందని అన్నారు. విధులు నిర్వర్తించడం, సృజనాత్మకత, వ్యక్తుల నిబద్ధత దేశంలోని ప్రతి పౌరుడి జీవితాలను మెరుగుపరచడానికి ప్రత్యక్షంగా దోహదం చేస్తాయని ప్రధానంగా చెప్పారు.

 

వ్యక్తులు బాధ్యతాయుతమైన స్థానాలకు చేరుకున్నప్పుడు.. దేశ పౌరులుగా వారి పాత్ర, విధులు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ దిశగా అవగాహన ఉండాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 'తల్లి పేరు మీద ఒక చెట్టు (ఏక్ పేడ్ మా కే నామ్)' పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన ప్రకృతికి కృతజ్ఞతగా, సేవకు చిహ్నంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలని కోరారు. తమ పనిచేసే ప్రదేశంలో ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని ఆయన కోరారు. మంచి ఉద్యోగ జీవితంలో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రారంభించడానికి జూన్‌లో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక గొప్ప సందర్బం అని పేర్కొన్నారు. ఆరోగ్యం వ్యక్తిగతమైన అంశం మాత్రమే కాదని.. పని సామర్థ్యం, దేశ ఉత్పాదకతకు కూడా కీలకమైనదని ప్రధానంగా తెలిపారు. త‌మ సామ‌ర్థ్యాలను పెంపొందించుకోవ‌డానికి మిష‌న్ క‌ర్మ యోగి కార్య‌క్ర‌మాన్ని వినియోగించుకోవాల‌ని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం పదవుల్లో ఉండటం మాత్రమే లక్ష్యం కాకూడదని.. దేశంలోని ప్రతిఒక్కరికి సేవ చేయడం, దేశ పురోగతికి తోడ్పడటమే లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా చెప్పిన ‘నాగరిక్ దేవో భవ' మంత్రాన్ని గుర్తు చేసిన ఆయన.. పౌరులకు సేవ చేయడం దైవారాధనతో సమానమని ప్రధానంగా చెప్పారు. చిత్తశుద్ధి, అంకితభావంతో భారతదేశం అభివృద్ధి చెందిన, సంపన్న దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల కలలు, ఆకాంక్షల సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

నేపథ్యం

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India pulls ahead in AI race with $10 billion in cross-border investments, tops Asia: Moody’s report

Media Coverage

India pulls ahead in AI race with $10 billion in cross-border investments, tops Asia: Moody’s report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan divas
June 23, 2025

The Prime Minister Shri Narendra Modi today paid tributes to Dr. Syama Prasad Mukherjee on his Balidan Divas.

In a post on X, he wrote:

“डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनके बलिदान दिवस पर कोटि-कोटि नमन। उन्होंने देश की अखंडता को अक्षुण्ण रखने के लिए अतुलनीय साहस और पुरुषार्थ का परिचय दिया। राष्ट्र निर्माण में उनका अमूल्य योगदान हमेशा श्रद्धापूर्वक याद किया जाएगा।”