ఆసియా క్రీడల్లో మహిళల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలేలో కాంస్య పతకం సాధించిన రోలర్ స్కేటర్లు కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు, ఆరతి కస్తూరి రాజ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ పోటీలో వారు చూపిన పట్టుదల, జట్టు స్ఫూర్తిని ఆయన కొనియాడారు. 7ీ ్యా ్ని
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“కార్తీక జగదీశ్వరన్, హీరల్ సాధు, ఆరతి కస్తూరి @heeral_sadhu, @aarathyskatingలకు నా అభినందనలు. మన అసాధారణ మహిళా స్పీడ్ స్కేటింగ్ రిలే జట్టు ఆసియా క్రీడల స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలేలో అద్భుతంగా రాణించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. వారి మొక్కవోని సంకల్పం, అత్యుత్తమ జట్టు స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to Karthika Jagdeeswaran, @heeral_sadhu and @aarathyskating. Our exceptional women's speed skating relay team wins a remarkable Bronze Medal in the Women's Speed Skating 3000m Relay at the Asian Games.
— Narendra Modi (@narendramodi) October 2, 2023
Their unwavering determination and outstanding teamwork is… pic.twitter.com/Gc0d2cOBYl