ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘షాట్‌పుట్ ఎఫ్-56/57’లో రజత పతకం సాధించిన సోమన్ రాణాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘షాట్‌పుట్ ఎఫ్-56/57’లో సోమన్ రాణా అద్భుతంగా రాణించి రజత పతకం సాధించడం మనందరికీ గర్వకారణం. అతని అద్భుత ప్రతిభ, దీక్ష మనందరికీ స్ఫూర్తిదాయకం. అతనికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A splendid Silver by Soman Rana in Men's Shot Put F-56/57 category gives us more reasons to celebrate at the Asian Para Games. Congratulations to him. pic.twitter.com/whS6htI7Jl
— Narendra Modi (@narendramodi) October 25, 2023


