సియా పారాగేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌హెచ్‌-6’ విభాగంలో కాంస్య పతక విజేతలు శివరాజన్, కృష్ణ నాగర్‌ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. ఈ జట్టు భవిష్యత్తులో మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఎస్‌హెచ్‌-6’లో కాంస్య పతకం సాధించిన శివరాజన్, కృష్ణ నాగర్‌ జోడీకి అభినందనలు. వారు భవిష్యత్తులో పాల్గొనబోయే పోటీలలో మరింత మెరుగైన విజయాలు సాధించాలని శుభాశీస్సులు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.