శ్రీ ఎస్. సురేశ్ కుమార్ గారు సాధించిన అసాధారణ విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. శ్రీ సురేశ్ కుమార్ బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ సాహసకృత్యం ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం.. సురేశ్ కుమార్ గారి దృఢ సంకల్పానికీ, మొక్కవోని ఉత్సాహానికీ నిదర్శనం. విశేషించి, గంభీర ఆరోగ్య సవాళ్లను అధిగమించి ఈ పనిని పూర్తి చేశారని శ్రీ మోదీ తెలిపారు.
ఇలాంటి ప్రయత్నాలు దేహ దారుఢ్యాన్నీ, దృఢ సంకల్పాన్నీ కలబోసి దేనినైనా సాధించవచ్చని సమాజంలో విస్తృత వర్గానికి ముఖ్య సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
శ్రీ సురేశ్ కుమార్ గారితో ప్రధానమంత్రి స్వయంగా ఆయనకు అభినందనలను తెలియజేశారు. ఈ యాత్ర ఆయన సాహసం, పట్టుదలల వల్లే సాధ్యపడిందంటూ ప్రధానమంత్రి మెచ్చుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ వేర్వేరు సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు శ్రీ ఎస్. సురేశ్ కుమార్ గారు సైకిల్‌‌ యాత్రను నిర్వహించడం ప్రశంసనీయమే కాక స్ఫూర్తిదాయకం కూడా. ఆరోగ్యపరమైన సవాళ్లను అధిగమించి మరీ ఈ అసాధారణ కార్యాన్ని ముగించడం ఆయన దృఢ సంకల్పాన్నీ, మొక్కవోని సాహసాన్నీ సూచిస్తోంది. ఇది ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక ముఖ్య సందేశాన్ని కూడా అందిస్తోంది.

ఆయనతో నేను మాట్లాడి... ఇందుకు అభినందనలు తెలియజేశాను.’’

 

 

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#

 

 

“ಬೆಂಗಳೂರಿನಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿಯವರೆಗೆ ಸೈಕಲ್ ಸವಾರಿ ಕೈಗೊಂಡ ಶ್ರೀ ಎಸ್. ಸುರೇಶ್ ಕುಮಾರ್ ಅವರ ಸಾಧನೆ ಶ್ಲಾಘನೀಯ ಮತ್ತು ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿದೆ. ಆರೋಗ್ಯದ ಹಿನ್ನಡೆಗಳನ್ನು ಮೆಟ್ಟಿ ನಿಂತು ಅವರು ಈ ಸಾಧನೆ ಮಾಡಿರುವುದು ಅವರ ದೃಢ ನಿರ್ಧಾರ ಮತ್ತು ಅಚಲ ಮನೋಭಾವವನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸುತ್ತದೆ. ಇದು ಫಿಟ್ನೆಸ್ ಕುರಿತು ಪ್ರಮುಖ ಸಂದೇಶವನ್ನೂ ನೀಡುತ್ತದೆ.

ಅವರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ಅವರ ಈ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಿದೆ.

@nimmasuresh

 

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt disburses Rs 28,748 crore under 14 PLI schemes till December 2025

Media Coverage

Govt disburses Rs 28,748 crore under 14 PLI schemes till December 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 ఫెబ్రవరి 2026
February 21, 2026

Citizens Agrees Modi Hai To Mumkin Hai: Human-Centric AI, Solar Surge & Manufacturing Boom – India’s Golden Rise