Congratulates Shri Eknath Shinde and Shri Ajit Pawar on taking oath as Deputy Chief Ministers
Assures all possible support from Centre in furthering development in Maharashtra

మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏక్‌నాథ్ షిండే, శ్రీ అజిత్ పవార్‌ కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

 

“మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీకి శుభాకాంక్షలు. 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఏక్ నాథ్ షిండే జీ, శ్రీ అజిత్ పవార్ జీకి శుభాకాంక్షలు.

అనుభవం, చైతన్యం కలగలసిన బృందమిది. ఈ బృందం సమష్టి కృషి వల్లే మహాయుతికి అనుకూలంగా మహారాష్ట్ర ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, సుపరిపాలన అందించడానికి ఈ బృందం చేయగలిగినంతా చేస్తుంది.

 

మహారాష్ట్రలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నాను” అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి పేర్కొన్నారు.  

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 సెప్టెంబర్ 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership