హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 1500ఎం టి-38 ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న రమణ్ శర్మను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
అతని అంకిత భావాన్ని ఆయన కొనియాడారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్ చేశారు.
‘‘ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 1500ఎం టి-38 ఈవెంట్ లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్న రమణ్ శర్మకు అభినందనలు.
అతను ప్రదర్శించిన చెక్కు చెదరని అంకిత భావం, వేగమే ఈ విజయాన్ని అందించాయి. రాబోయే క్రీడా ఈవెంట్లలో కూడా అతనికి విజయాలు లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Congratulations to Raman Sharma for his remarkable victory in the Men's 1500m T-38 event at the Asian Para Games.
— Narendra Modi (@narendramodi) October 27, 2023
His unwavering determination and speed have earned this great success. Best wishes for the endeavours ahead. pic.twitter.com/WBnKdup8Ew


