జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్‌లో సంభాషించి, అభినందనలు తెలిపారు.
గత 25 సంవత్సరాలుగా భారత్ - జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో అద్భుతమైన పురోగతిపై చర్చించారు. వాణిజ్యం - పెట్టుబడి, రక్షణ - భద్రత, ఆవిష్కరణ - సాంకేతికత వంటి రంగాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా సన్నిహితంగా పనిచేయడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. జర్మనీ పురోగతిలో భారతీయ ప్రవాసుల సానుకూల కృషిపైనా వారిద్దరూ చర్చించారు.
ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
భారత్‌ను సందర్శించాల్సిందిగా జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌ను భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీ ఆహ్వానించారు. సంప్రదింపులను కొనసాగించడానికి నాయకులిద్దరూ అంగీకరించారు.
Spoke to Chancellor @_FriedrichMerz and congratulated him on assuming office. Reaffirmed our commitment to further strengthen the Strategic Partnership between India and Germany. Exchanged views on regional and global developments. We stand united in the fight against terrorism.
— Narendra Modi (@narendramodi) May 20, 2025


