సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇరు దేశాల ప్రజలను అనుసంధానించే, ప్రజల ఆకాంక్షలూ, అవసరాలకు అండగా నిలిచే ఉమ్మడి వారసత్వంగా హిందూ మహాసముద్ర జలాలను ప్రధానమంత్రి అభివర్ణించారు. డాక్టర్ హెర్మినీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్-సీషెల్స్ మధ్య గల ప్రభావవంతమైన, బహుముఖ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, మరింత ఊపందుకుంటాయనీ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"సీషెల్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి హృదయపూర్వక అభినందనలు. హిందూ మహాసముద్ర జలాలు మన ఉమ్మడి వారసత్వం.. మన ప్రజల ఆకాంక్షలూ, అవసరాలకు అనుబంధంగా ఉన్నాయి. అధ్యక్షుడిగా ఆయన పదవీకాలంలో ఇరుదేశాల మధ్య గల ప్రభావవంతమైన, బహుముఖ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని, మరింత ఊపందుకుంటాయనీ నేను విశ్వసిస్తున్నాను. రానున్న ఆయన పదవీకాలం కోసం ఆయనకు నా శుభాకాంక్షలు."

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission

Media Coverage

ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 సెప్టెంబర్ 2026
September 11, 2026

Seva Pakhwada to Superpower Status: Why Citizens Are Hailing PM Modi’s Relentless Push