ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తిగా శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్  ను కొనియాడుతూ, ప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతో, లోతైన అవగాహనతో చిత్రీకరించిన రచయితగా ప్రధాని ప్రశంసించారు.

“ శంకర్ అని అందరూ ప్రేమగా పిలిచే  శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ గారి మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన బెంగాలీ సాహిత్యంలో ఒక మహోన్నత వ్యక్తి. ఆయన రచనలు ప్రజల జీవితాలను ఎంతో సున్నితత్వంతో,  లోతైన అవగాహనతో ప్రతిబింబించాయి. మరువలేని రచనల ద్వారా ఆయన తరతరాల పాఠకులను ప్రభావితం చేయడమే కాకుండా భారత సాహిత్య ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్టు చేశారు. 

 

 

“শ্রী মণি শঙ্কর মুখোপাধ্যায়-যিনি শংকর নামে বিখ্যাত- এর প্রয়াণে গভীরভাবে শোকাহত ।

বাংলা সাহিত্যের এক উজ্জ্বল নক্ষত্র হিসেবে তিনি মানুষের জীবনকে অসাধারণ সংবেদনশীলতা ও অন্তর্দৃষ্টির সঙ্গে তাঁর লেখায় তুলে ধরেছেন। তাঁর অবিস্মরণীয় সৃষ্টি, বিভিন্ন প্রজন্মের পাঠককে প্রভাবিত এবং ভারতের সাহিত্যভাণ্ডারকে সমৃদ্ধ করেছে।

তাঁর পরিবার, বন্ধু ও অসংখ্য অনুরাগীর প্রতি আমার আন্তরিক সমবেদনা রইল। ওঁ শান্তি।”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's Major Ports Handled Record 915 Million Tonnes Cargo In FY26, Surpass Annual Target

Media Coverage

India's Major Ports Handled Record 915 Million Tonnes Cargo In FY26, Surpass Annual Target
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 6 ఏప్రిల్ 2026
April 06, 2026

India’s Golden Chapter: PM Modi Turns Vision into Records From Ports to People, From Naxal to Naval