నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ జీ మృతి పట్ల ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేషన్ గారు ఇక మన మధ్య లేరని తెలిసి బాధ పడ్డాను. అంకిత భావం కలిగిన ఒక జాతీయ వాదిగా ఆయనను స్మరించుకుంటూ ఉంటాం. ఆయన తన జీవనాన్ని సేవకూ, దేశ నిర్మాణానికీ అంకితం చేశారు. తమిళనాడులో బీజేపీని విస్తరించడానికి ఆయన ఎంతో శ్రమించారు. తమిళ సంస్కృతి అంటే ఆయనకు ఎంతో మక్కువ. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను సానుభూతిని తెలియజేస్తున్నా. ఓం శాంతి.’’ 

 

“நாகாலாந்து ஆளுநர் திரு இல. கணேசன் அவர்களின் மறைவால் வேதனை அடைந்தேன். தேச சேவைக்கும், தேசத்தைச் சிறப்பாகக் கட்டமைக்கவும் தமது வாழ்க்கையை அர்ப்பணித்த ஒரு உண்மையான தேசியவாதியாக அவர் எப்போதும் நினைவுகூரப்படுவார். தமிழ்நாடு முழுவதும் பிஜேபி-யின் வளர்ச்சிக்கு அவர் கடுமையாக உழைத்தார். தமிழ் கலாச்சாரத்தின் மீது அவருக்கு மிகுந்த ஆர்வம் இருந்தது. எனது எண்ணங்கள் அவரது குடும்பத்தினருடனும் அவரது ஆதரவாளர்களுடனும் உள்ளன. ஓம் சாந்தி.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.