అద్భుతమైన ఆమె సంగీత ప్రయాణాన్నీ, ఆమె ప్రతిభనీ కొనియాడిన పీఎం

భారతదేశం గర్వించదగిన, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించిందని ప్రధానమంత్రి అన్నారు. ఆమె ఆలపించిన మధురగీతాల ద్వారా, శక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేదని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారు. రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారని, ఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"భారతదేశం గర్వించదగిన, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణం... బాధాకరం. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించింది. ఆమె ఆలపించిన మధురగీతాల ద్వారా, శక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఆమె కుటుంబసభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి"

 

“भारतातील सर्वात ख्यातनाम आणि अष्टपैलू आवाजांपैकी एक असलेल्या आशा भोसले जी यांच्या निधनाने अतिशय दुःख झाले. त्यांच्या अनेक दशकांच्या अद्वितीय संगीत प्रवासाने आपल्या सांस्कृतिक वारशाला समृद्ध केले आणि जगभरातील असंख्य लोकांच्या मनाला स्पर्श केला. भावपूर्ण गीतांपासून ते जोशपूर्ण संगीत रचनांपर्यंत, त्यांच्या आवाजात कालातीत तेज होते. त्यांच्याशी झालेल्या संवादांच्या आठवणी मी सदैव जपून ठेवेन. त्यांच्या कुटुंबीयांना, चाहत्यांना आणि संगीतप्रेमींना माझ्या भावपूर्ण संवेदना. त्या पुढील पिढ्यांना प्रेरणा देत राहतील आणि त्यांची गाणी सदैव लोकांच्या आयुष्यात गुंजत राहतील.”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report

Media Coverage

Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 మే 2026
May 27, 2026

Strategic, Sustainable, Self-Reliant: How PM Modi is Building Viksit Bharat