కర్ణాటక రాష్ట్రం హసన్‌లో సంభవించిన ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కర్ణాటకలోని హసన్‌లో ప్రమాద సంఘటన హృదయాన్ని కలచివేసింది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న మృతుల కుటుంబాలకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. అలాగే గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి తలా రూ.2 లక్షలు, క్షతగాత్రులకు తలా రూ.50,000 వంతున పరిహారం చెల్లిస్తామని ప్రకటిస్తున్నాను” అని ప్రధానమంత్రి PM @narendramodi పేర్కొన్నట్లు తెలిపింది.
The mishap in Hassan, Karnataka, is heart-rending. In this tragic hour, my thoughts are with the bereaved families. I hope those who have been injured recover at the earliest.
— PMO India (@PMOIndia) September 13, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured…


