ప్రముఖ కవి, మేధావి అందెశ్రీ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి  తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ - 

‘‘అందెశ్రీ మృతి మన సాంస్కృతిక జగతికీ, మేధో ప్రపంచానికీ పెద్ద లోటు . ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మకు అద్దం పట్టాయి. ఆయన ఒక ప్రముఖ కవి, మేధావి. ప్రజల గొంతుకగా ఉంటూ, వారి సంఘర్షణలనూ, తపననూ, మొక్కవోని స్ఫూర్తినీ ఎలుగెత్తి చాటారు. ఆయన రచనలు హృదయాలను స్పందింపచేసి, ప్రజలను ఏకతాటి పైకి తెచ్చి, సమాజ సామూహిక స్పందనను తీర్చిదిద్దాయి. సామాజిక చైతన్యాన్ని సాహితీ శోభతో ఆయన కలబోసిన తీరు విశిష్టమైంది. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

“అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి."

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 09 ఆగష్టు 2026
August 09, 2026

Vikas Bhi, Virasat Bhi: PM Modi’s Blueprint for a Rooted Yet Future-Ready Bharat