ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్) మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారాన్ని వ్యక్తం చేశారు.
సాయుధ దళాల నుంచి రాజకీయ రంగం వరకూ- మేజర్ జనరల్ ఖండూరీ అమూల్య సేవలను అందించారనీ, ఈ కారణంగా ఆయనను సదా స్మరించుకుంటామనీ ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యమంత్రిగా మేజర్ జనరల్ ఖండూరీ పదవీకాలంలో ఉత్తరాఖండ్ అభివృద్ధి పట్ల అచంచల అంకితభావాన్ని కనబరిచారని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా శ్రీ ఖండూరీ పదవీకాలం కూడా సరైన అర్థంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. దేశవ్యాప్తంగా అనుసంధాన వ్యవస్థను గణనీయంగా మెరుగుపరచడానికి శ్రీ ఖండూరీ అవిశ్రాంతంగా కృషి చేశారని ప్రధాని ప్రశంసించారు.
ఈ శోక ఘడియలో దివంగత నేత కుటుంబానికీ, మద్దతుదారులకీ ప్రధానమంత్రి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ :
‘‘ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీ (రిటైర్డ్) ఇక లేరని తెలిసి చాలా బాధ పడ్డాను. సాయుధ దళాల మొదలు రాజకీయ రంగం వరకూ ఆయన అమూల్యమైన సేవలను అందించారు. ఇందుకు ఆయన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేశారు. ఇది ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలంలో స్పష్టంగా కనిపించింది. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పదవీకాలం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని అందిస్తుంది. దేశవ్యాప్తంగా అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఆయన నిరంతరం అలుపెరుగని ప్రయత్నాలు చేశారు. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబానికీ, ఆయన మద్దతుదారులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth