పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటన

గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

ప్రమాద స్థలంలో పరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో మాట్లాడానని ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ విషాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:

“గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరం. ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ గారితో మాట్లాడాను. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది.

 

మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొంది:

"గోవాలోని అర్పోరాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తున్నాం: శ్రీ నరేంద్ర మోదీ

 

 

The Prime Minister also announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister’s Office posted on X;

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be given to the next of kin of each deceased in the mishap in Arpora, Goa. The injured would be given Rs. 50,000: PM @narendramodi”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership