కెనడాలో తుపాకి కాల్పుల ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. ‘‘ఈ విషాద ఘడియలో భారత్ .. కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘కెనడాలో భయానక తుపాకి కాల్పుల ఘటన సంగతి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. భారత్ ఈ విషాద ఘడియలో కెనడా ప్రజల వెన్నంటి నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు.
Deeply shocked by the horrendous shooting in Canada. I extend my heartfelt condolences to the families who have lost their loved ones and wish a speedy recovery to the injured. India stands in solidarity with the people of Canada in this moment of profound grief. @MarkJCarney
— Narendra Modi (@narendramodi) February 11, 2026


