పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌ -గ్రేషియా ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ దుర్ఘటనలో మృతుల దగ్గరి సంబంధికులకు 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్- గ్రేషియాను కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో -

‘‘అనకాపల్లి లో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణ నష్టం సంభవించడం నాకు వేదన కలిగించింది.  ప్రియతములను కోల్పోయిన వారికి  సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని  కోరుకొంటున్నాను.  మృతుల దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఎక్స్‌ గ్రేషియాను ఇవ్వడం జరుగుతుంది.  : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Two-wheeler sales rise 35% in February on low base, GST-led recovery

Media Coverage

Two-wheeler sales rise 35% in February on low base, GST-led recovery
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 మార్చి 2026
March 03, 2026

Citizens Express Their Appreciation on Heartfelt Leadership, Historic Gains: PM Modi’s India Shines in Conservation, Commerce, and Clean Energy