మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన ప్రమాదంలో పలువురి మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“మధ్యప్రదేశ్‌లోని ఝబువాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
మృతిచెందినవారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి @narendramodi’’
Deeply anguished by the loss of lives due to an accident in Jhabua, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
— PMO India (@PMOIndia) June 4, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…


