బిహార్ లోని వైశాలి లో జరిగిన ఒక దుర్ఘటన లో వ్యక్తులు మరణించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని, అలాగే గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘బిహార్ లోని వైశాలి లో జరిగిన దుర్ఘటన దుఃఖదాయకం గా ఉంది. తమ ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
The accident in Vaishali, Bihar is saddening. Condolences to the bereaved families. May the injured recover soon. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 20, 2022


