పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు

బిహార్ లోని వైశాలి లో జరిగిన ఒక దుర్ఘటన లో వ్యక్తులు మరణించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరిత గతి న పునఃస్వస్థులు కావాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని, అలాగే గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘బిహార్ లోని వైశాలి లో జరిగిన దుర్ఘటన దుఃఖదాయకం గా ఉంది. తమ ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతు న ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 జూన్ 2026
June 25, 2026

Viksit Bharat in Action: PM Modi's Reforms Powering Inclusive Growth, Tech Innovation & Global Competitiveness