జాపాన్ లోని వాకాయామా లో ఒక సార్వత్రిక కార్యక్రమం సందర్భం లో జరిగిన హింసాత్మక ఘటన ను ఖండించిన ప్రధాన మంత్రి

పిఐబి, దిల్లీ ద్వారా 2023 ఏప్రిల్ 15 వ తేదీ న మధ్యాహ్నం 2 గంట ల 50 నిమిషాల కు పోస్ట్ చేయడమైంది

జాపాన్ ప్రధాన మంత్రి శ్రీ ఫుమియొ కిశిదా జాపాన్ లోని వాకాయామా లో జరిగిన ఒక సార్వత్రిక కార్యక్రమం లో పాలుపంచుకోగా, ఆ సందర్భం లో అక్కడ ఓ హింసాత్మక ఘటన చోటుచేసుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘జాపాన్ లోని వాకయామా లో ఒక సార్వత్రిక కార్యక్రమం లో జరిగిన హింసాత్మక సంఘటన గురించి తెలిసింది. ఆ కార్యక్రమం లో నా మిత్రుడు ప్రధాని శ్రీ @Kishida230 పాలుపంచుకొన్నారు. హమ్మయ్య! ఆయన సురక్షితం గా ఉన్నారు. ఆయన నిరంతరం కులాసా గాను, మంచి ఆరోగ్యం తోను ఉండేటట్టు చూడాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. భారతదేశం హింస తాలూకు అన్ని చేష్టల ను ఎప్పటికీ ఖండిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s economy resilient despite West Asia headwinds

Media Coverage

India’s economy resilient despite West Asia headwinds
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Nagaland meets Prime Minister
March 24, 2026