జాతిభద్రత విషయమై ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దేశం మొత్తంలో అప్రమత్తత, అంతర మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం వంటి ముఖ్యమైన అంశాలను సమీక్షిస్తూ... వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. మంత్రిత్వశాఖలూ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సందిగ్ధానికి తావులేకుండా చక్కటి సమన్వయం ఉండాలనీ, వ్యవస్థ మొత్తం అత్యంత పటిష్టంగా ఉండాలనీ ఆయన గట్టిగా సూచించారు.

ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో మంత్రిత్వ శాఖల ప్రణాళికలను, సన్నద్ధతను ప్రధాని సమీక్షించారు. 

తమకు సంబంధించిన మంత్రిత్వ శాఖల కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆయన కార్యదర్శులను ఆదేశించారు. అలాగే అవసరమైన వ్యవస్థల పనితీరులో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంతో పాటు సన్నద్ధత, అత్యవసర సమయాల్లో స్పందన, అంతర్గత సమాచార వ్యవస్థల ప్రొటోకాల్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు.

ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా- మంత్రిత్వశాఖల ప్రణాళికలూ- సన్నద్దత అంశాలను ఆయన సమీక్షించారు.

మంత్రిత్వశాఖల సన్నాహాలు, సంబంధిత అత్యవసర వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నదీ లేనిదీ కూడా శాఖల వారీగా ఆయా శాఖలకు చెందిన కార్యదర్శులు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర వ్యవస్థల సన్నద్ధత, సత్వర స్పందన, ప్రోటోకాల్ కు అనుగుణంగా సమాచార వినిమయం- అన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు.

ప్రస్తుత సమయంలో- ప్రభుత్వం-ఏకోన్ముఖంగా అన్నట్లు ఏ రకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నదీ కార్యదర్శులు వివరంగా ప్రధానమంత్రి ముందు ఉంచారు.

ఘర్షణకు సంబంధించి- వెంటనే కార్యచరణకు దిగాల్సిన అంశాలను అన్ని మంత్రిత్వశాఖలూ ఇప్పటికే గుర్తించాయి. కార్యాచరణకు వీలుగా వాటిని మరింత బలోపేతం కూడా చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు మంత్రిత్వశాఖలన్నీ సర్వసన్నద్ధంగా ఉన్నాయి.


 

సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. సివిల్- డిఫెన్స్ వ్యవస్థలూ, అబద్ధపు వార్తల ప్రచారాన్ని నిరోధించడం, కీలక వ్యవస్థల భద్రత వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్రస్థాయి వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకోవాలని కూడా మంత్రిత్వశాఖలకు సూచించారు.

ఈ సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు, రక్షణ, హోం వ్యవహరాలు, విదేశీ వ్యవహారాలు, సమాచార-ప్రసార శాఖ, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్లతో పాటు ఇతర కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న సున్నిత వాతావరణంలో- నిరంతర అప్రమత్తత, సంస్థాగత సమన్వయం, స్పష్టమైన సమాచార వినిమయం ఉండాలని ప్రధానమంత్రి తెలిపారు. దేశభద్రత, కార్యసన్నద్ధత, పౌర రక్షణ అంశాల్లో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance

Media Coverage

India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi