హాంగ్ ఝూలో జరుగుతున్న 2022 ఆసియా క్రీడోత్సవాల్లో వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించినందుకు నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ
‘‘ఆసియా క్రీడోత్సవాల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి స్వర్ణ పతకం సాధించాడు. ఈ చారిత్రక విజయానికి అతనికి అభినందనలు. ఎన్నో సంవత్సరాల శిక్షణ, అంకిత భావం అతనికి ఈ అద్భుత విజయం సాధించి పెట్టాయి. అతను విజయాల్లో కొత్త శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను. అతనికి అభినందనలు’’
Second Consecutive Gold in Javelin Throw for @Neeraj_chopra1 in the Asian Games. Congrats to him for this historic feat. This spectacular victory is the result of his dedication and years of training. May he keep scaling new heights of success. All the best to him. pic.twitter.com/imfeikGKUc
— Narendra Modi (@narendramodi) October 4, 2023