ఫిబ్రవరి 6, 2026 ప్రసారమయ్యే ప్రత్యేక పరీక్షా పే చర్చా ఎపిసోడ్‌ను వీక్షించాలని దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యువతలోని సమష్టి స్ఫూర్తి,   ఆసక్తికరమైన సంభాషణలను గమనించవచ్చని ఆయన తెలిపారు.

పరీక్షల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధానమంత్రి మరోసారి ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం ద్వారా యువ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ ఏడాది దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీలోని 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న పరీక్షా యోధులతో ఈ ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు.

ఈ అనుభవాన్ని  ఉత్తేజకరమైనదిగా, స్ఫూర్తిదాయకంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. విద్యార్థుల ఉత్సాహం, స్వేచ్ఛాయుత ఆలోచనలను ప్రశంసిస్తూ.. ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. సవాళ్లను అధిగమించడం, సమతుల్యతను కాపాడుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంపై ఆచరణాత్మక సూచనలను ప్రధానమంత్రి పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘పరీక్షలు దగ్గరపడుతుండటంతో #పరీక్షా పే చర్చా మళ్ళీ వచ్చేసింది!

ఈసారి దేవ్‌మోగ్రా, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గువాహటి, ఢిల్లీలోని 7 ఎల్ కేఎమ్ వద్ద పరీక్షా యోధులతో  పరీక్ష పే చర్చా జరిగింది. ఎప్పటిలాగే  నా యువ మిత్రులతో సంభాషించడం, ఒత్తిడి లేని పరీక్షలు, ఇతర అనేక విషయాల గురించి చర్చించడం ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది.

ఫిబ్రవరి 6వ తేదీన ప్రసారం కానున్న పీసీసీ ఎపిసోడ్‌ను తప్పక చూడండి!’’

 

 

The Prime Minister Shri Narendra Modi today invited citizens to watch the special Pariksha Pe Charcha episode on February 6, 2026, to witness these engaging conversations and the collective spirit of India’s youth.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities

Media Coverage

How India’s Rs 175 crore Diving Support Craft projects strengthen Navy’s underwater capabilities
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026