ఈ రోజు ప్యారిస్‌లో నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ సీఈఓస్ ఫోరమ్ పద్నాలుగో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్‌...ప్రసంగించారు. ఈ ఫోరమ్ ఇరు పక్షాలకు చెందిన వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సీఈఓల)ను ఒక చోటుకు చేర్చింది. ఇది రక్షణ, ఏరోస్పేస్, కీలక టెక్నాలజీలు-కొత్తగా ఉనికిలోకి వస్తున్న టెక్నాలజీలు, మౌలిక సదుపాయాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, కృత్రిమ మేధ, వైద్య ఆరోగ్య శాస్త్రాలు, జీవనశైలిలతోపాటు ఆహారం, ఆతిథ్య రంగాలపై దృష్టిని కేంద్రీకరించింది.

 

భారత్, ఫ్రాన్స్‌ల వ్యాపారం, ఆర్థిక సహకారం అంతకంతకు విస్తరిస్తూ ఉండడాన్ని, రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి అది అందించిన ప్రేరణను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. సుస్థిర ప్రభుత్వ విధానాలే కాక విధాన నిర్ణయాల అమలు పరంగా అంచనాలతో సరిపోలే తరహా మార్పుచేర్పులను ఇండియా అనుసరిస్తూ ఉన్న కారణంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోని అనేక దేశాలకు అభిమానపాత్ర దేశంగా మారిందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఇటీవల బడ్జెటులో ప్రకటించిన సంస్కరణలను గురించి ఆయన మాట్లాడుతూ... బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించిన సంగతిని ప్రస్తావించారు. పౌర ప్రయోజనాలే ప్రధానంగా పరమాణు ఇంధన రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రైవేటు ప్రాతినిధ్యానికి అవకాశాన్ని కల్పించడంతోపాటు ఇంధన మార్పునకు, డీకార్బనైజేషన్‌కు తోడ్పడే వినూత్న అణు సాంకేతికతలైన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్), అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్ల (ఏఎంఆర్)పై దృష్టి సారించడాన్ని గురించి, కస్టమ్స్ రేటు స్వరూపాన్ని సువ్యవస్థీకరించడాన్ని గురించి కూడా ఆయన వివరించారు. ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సరళతర ఆదాయపు పన్ను విధానాన్ని తీసుకువచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. సంస్కరణలను ప్రవేశపెట్టడాన్ని కొనసాగించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెబుతూ, ఆర్థిక కార్యకలాపాల పర్యవేక్షణలో నమ్మకానికి పెద్దపీటను వేస్తూ సువ్యవస్థీకరణ ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ఒక ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇదే తరహా స్ఫూర్తితో, గత కొన్నేళ్లలో 40,000కు పైగా నియమపాలన నిర్బంధాలను తొలగించి హేతుబద్ధీకరణకు తావు ఇచ్చామని ఆయన అన్నారు.

 

వ‌ృద్ధి సాధన దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో, రక్షణ, ఇంధనం, హైవే, పౌర విమానయానం, అంతరిక్షం, ఆరోగ్యసంరక్షణ, ఫిన్‌టెక్, స్థిరాభివృద్ధి రంగాల్లో లభిస్తున్న చాలా అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా ఫ్రాన్స్‌కు చెందిన కంపెనీలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నైపుణ్యాలు, ప్రతిభ, నవకల్పనలతోపాటు భారత్ ఇటీవలే కొత్తగా చేపట్టిన కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్, క్వాంటమ్, కీలక ఖనిజాలు, హైడ్రోజన్ మిషన్‌ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తే కాక ప్రశంసలు కూడా వ్యక్తం అవుతున్నాయని ఫ్రాన్స్ వాణిజ్య వ్యవస్థలు పరస్పర వృద్ధి కోసం, సమృద్ధి కోసం ఇండియాతో చేతులు కలపాలని ఆయన సూచించారు. ఈ రంగాల్లో క్రియాశీల సంబంధాల్ని నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఆయన స్పష్టం చేస్తూ, నవకల్పన, పెట్టుబడులు, సాంకేతికత చోదకశక్తిగా ఉండే భాగస్వామ్యాల్ని పెంచుకోవాలన్న ఇరు దేశాల నిబద్ధతను పునరాద్ఘాటించారు. ప్రధాని పూర్తి ప్రసంగం పాఠాన్ని ఇక్కడ ( here ) చూడొచ్చు.

 

ఫోరమ్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌‌, ఫ్రాన్స్‌కు చెందిన ఐరోపా శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ జీన్ నోయల్ బరాట్, ఫ్రాన్స్ ఎకానమీ, ఫైనాన్స్, ఇండస్ట్రియల్ అండ్ డిజిటల్ సావరినిటీ శాఖ మంత్రి శ్రీ ఎరిక్ లంబార్డ్‌ కూడా ఉన్నారు.

5. సమావేశానికి హాజరైన ఇరు పక్షాల సీఈఓలు ఎవరెవరంటే:

 

భారత్ పక్షాన:

 Company Name(Sector)Name and Designation

1

Jubiliant Foodsworks/Jubiliant Life Sciences, Food and Beverage

Hari Bhartia, Co-Chairman and Director

2.

CII

Chandrajit Banerjee, Director General

3.

Titagarh Rail Systems Limited (TRSL), Railways and Infrastructure

Umesh Chowdhary, Vice Chairman and Managing Director

4.

Bharat Light & Power Private Limited, (Renewable Energy)

Tejpreet Chopra, President & CEO

5.

P Mafatlal Group, Textiles and Industrial Products

Vishad Mafatlal, Chairman

6.

boat, Consumer Electronics (Wearables)

Aman Gupta, Co-Founder

7.

Dalit Indian Chamber of Commerce & Industry (DICCI), Business Advocacy and Inclusion

Milind Kamble, Founder/Chairman

8.

Skyroot Aerospace, Aerospace & Space and Technology

Pawan Kumar Chandana,Co-Founder

9.

Agnikul, Aerospace & Space and Technology

Srinath Ravichandran, Co-Founder & CEO

10.

Tata Advanced Systems Ltd, Aerospace and Defense

Sukaran Singh, Managing Director

11

UPL Group, Agrochemical and Agribusiness

Vikram Shroff, Vice Chairman and Co-CEO

12.

Sula Vineyards, Food and Beverage

Rajeev Samant, CEO

13.

Dynamatic Technologies Ltd, Aerospace & Defence, and Engineering

Udayant Malhoutra, CEO & Managing Director

14.

Tata Consulting Engineers (TCE), Engineering and Consulting

Amit Sharma, Managing Director & CEO

15.

Nykaa, Cosmetics and consumer goods

Falguni Nayyar,CEO

French Side:

 Company Name(Sector)Name and Designation

1

Air Bus, Aerospace & Defence

Guillaume Faury, CEO

2.

Air Liquide, Chemicals, Health care, Engineering

François Jackow, CEO & a member of the Board of Directors of the Air Liquide Group

3.

BlaBlaCar, Transport, Services

Nicolas Brusson, CEO & Co-Founder

4

Capgemini Group, Information Technology, Engineering

Aiman Ezzat, CEO

5

Danone, Food & Beverages

Antoine de SAINT-AFFRIQUE, CEO

6

EDF, Energy, Power

Luc Rémont, Chairman &CEO

7

Egis Group, Architecture Construction Engineering

Laurent Germain,CEO

8.

Engie Group, Energy, Renewable Energy

Catherine MacGregor, CEO & Board Member of ENGIE.

9

L'Oréal, Cosmetics & Consumer Goods

Nicolas Hieronimus, CEO & Member of Board of Directors

10

Mistral AI, Artificial Intelligence

Arthur Mensch, CEO & Co-Founder

11

Naval Group, Defence, Shipbuilding, Engineering

Pierre Eric Pommellet, Chairman & CEO

12.

Pernod Ricard, Alcohol Beverages, FMCG

Alexandre Ricard, Chairman & CEO

13

Safran, Aerospace & Defence

Olivier Andriès, CEO

14.

Servier, Pharmaceuticals, Health care

Olivier Laureau, President & CEO

15

Total Energies SE, Energy

PATRICK Pouyanné, Chairman & CEO

16

Vicat, Construction

Guy Sidos, Chairman & CEO

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment

Media Coverage

Moving beyond Western paradigms: The geopolitical lesson of India’s multi-alignment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in a mishap in Surat, Gujarat
June 02, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed deep pain over the tragic mishap in Surat district, Gujarat. He extended his heartfelt condolences to those who have lost their loved ones and prayed for the earliest recovery of the injured. The Prime Minister noted that rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) for the next of kin of each deceased. Shri Modi also noted that Rs. 50,000 would be provided to those who sustained injuries in the incident.

The Prime Minister posted on X:

"Deeply pained to hear about a mishap in Surat district, Gujarat. My condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM"