‘‘బడ్జెటు అనంతర కాలం లో వెబినార్ ల నిర్వహణ ద్వారా బడ్జెటు ను అమలు పరచడం లోసామూహిక యాజమాన్యానికి మరియు సమాన భాగస్వామ్యాని కి ప్రభుత్వం బాట ను పరుస్తున్నది’’
‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ లో జరిగే ప్రతి ఒక్క చర్చ లో ప్రశ్నార్థాకాలస్థానాన్ని విశ్వాసం మరియు అంచనాలు అనేవి భర్తీ చేసేశాయి’’
‘‘భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక ప్రకాశవంతమైన స్థానం గావ్యవహరించడం జరుగుతున్నది’’
‘‘ప్రస్తుతం మీకు ధైర్యం తో, స్పష్టత తో మరియు విశ్వాసం తో విధాన నిర్ణయాల నుతీసుకొంటున్నటువంటి ఒక ప్రభుత్వం ఉంది, మరి మీరు కూడా ముందడుగు ను వేయవలసి ఉంది’’
‘‘భారతదేశం లోని బ్యాంకింగ్ వ్యవస్థ లో ఉన్న శక్తి తాలూకు లాభాలు వీలైనంతఎక్కువ మంది ప్రజల కు చేరడం అనేది తక్షణావసరం’’
‘‘అన్ని వర్గాల వారి కి ఆర్థిక సేవల ను అందజేయడానికి సంబంధించి ప్రభుత్వంతీసుకు వస్తున్న విధానాలు కోట్ల కొద్దీ ప్రజల ను లాంఛన ప్రాయ ఆర్థిక వ్యవస్థ లోభాగస్తుల ను చేశాయి’’
‘‘ ‘వోకల్ ఫార్ లోకల్’ తాలూకు దృష్టికోణం మరియు ఆత్మనిర్భరత అనేవి జాతీయబాధ్యత లు’’
‘‘ ‘వోకల్ ఫార్ లోకల్’ అనేది భారతదేశంలోని కుటీర పరిశ్రమ యొక్క ఉత్పాదనల నుకొనుగోలు చేయడం కంటే పెద్దది; సామర్థ్యాల ను భారతదేశం లోనే పెంచడం ద్వారా దేశం లో ఏయేరంగాల లో మనం డబ్బు ను మిగుల్చుకోగలం అనేది పరిశీలించాలి’’
‘‘ప్రభుత్వం మాదిరి గానే ప్రైవేటు రంగం పెట్టుబడి ని పెంచాలి; అదే జరిగితే దాని నుండి గరిష్ఠప్రయోజనాన్ని దేశం అందుకొంటుంది’’
‘‘ట్యాక్స్బేస్ అధికం కావడం ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకాని కి ఒక రుజువు గా ఉన్నది, మరి వారు చెల్లిస్తున్నటువంటి పన్నులను ప్రజల హితం కోసం ఖర్చు చేయడం జరుగుతోందని వారు నమ్ముతున్నారు’’
‘‘ ‘ఇండస్ట్రీ 4.0’ కాలం లో భారతదేశం అభివృద్ధి పరచినటువంటి ప్లాట్ఫార్మ్ స్ ప్రపంచాని కి నమూనాలు అవుతున్నాయి’’
‘‘రూపే ఇంకా యుపిఐ లు కేవలం తక్కువ ఖర్చు తో కూడినటువంటి మరియు అధిక భద్రత కలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాక ప్రపంచం లో మన యొక్క గుర్తింపు గా కూడాను నిలుస్తున్నాయి’’

‘వృద్ధి అవకాశాల ను సృష్టించడం కోసం ఆర్థిక సేవ ల సామర్థ్యాన్ని అధికం చేయడం’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర కాల వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావవంతమైనటువంటి రీతి లో అమలు చేయడం కోసం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర కాల వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ పదో వెబినార్.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ బడ్జెటు అనంతర కాల వెబినార్ ల ద్వారా బడ్జెటు అమలు ప్రక్రియ లో సామూహిక యాజమాన్యం కోసం మరియు సమాన భాగస్వామ్యం కోసం ప్రభుత్వం బాట ను పరుస్తోంది అన్నారు. ఈ వెబినార్ లలో స్టేక్ హోల్డర్స్ వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాల కు మరియు సూచనల కు అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి కాలం లో భారతదేశం అవలంబించిన కోశ విధానం మరియు ధన సంబంధి విధానంల యొక్క ప్రభావాన్ని, గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం ఆర్థిక వ్యవస్థ తాలూకు పునాదుల ను బలపరచడం లో ప్రభుత్వం యొక్క ప్రయాసల ను యావత్తు ప్రపంచం గమనించి కొనియాడిందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశానికేసి ప్రపంచం అనుమానపు దృష్టి ని సారించిన కాలం ఉండింది అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, భారతదేశం ఆర్థిక వ్యవస్థ ను గురించిన చర్చ లు తరచు గా ప్రశ్న తో మొదలై ప్రశ్నతో ముగిసేవి అన్నారు. ఆర్థిక పరమైన క్రమశిక్షణ లో, పారదర్శకత్వం లో మరియు సమ్మిళిత వైఖరి లో వచ్చిన మార్పుల ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావిస్తూ, చర్చ యొక్క ఆరంభం లోను, ముగింపు లోను తలెత్తిన ప్రశ్నార్థకం స్థానం లోకి విశ్వాసం మరియు అపేక్ష లు వచ్చి చేరాయి అని పేర్కొన్నారు. ఇటీవలి కార్యసాధనల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘ప్రస్తుతం భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక ప్రకాశవంతమైనటువంటి స్థానం గా వ్యవహరించడం జరుగుతోంది.’’ అన్నారు. భారతదేశం జి-20 కి అధ్యక్షత ను వహిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, 2021-22 సంవత్సరం లో దేశం లోకి అత్యధిక స్థాయి లో ఎఫ్ డిఐ తరలివచ్చింది అన్నారు. ఈ రాశి లో ఒక పెద్ద భాగం తయారీ రంగం లోకి ప్రవహించింది అని ప్రధాన మంత్రి చెప్పారు. గ్లోబల్ సప్లయ్ చైన్ లో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భాగం గా మలచేటటువంటి పిఎల్ఐ పథకాన్ని వినియోగించుకోవడం కోసం దరఖాస్తు లు వెల్లువెత్తుతున్నాయి అని ఆయన నొక్కిచెప్పారు. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయి లో సద్వినియోగ పరచుకోండి అంటూ ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం భారతదేశం నూతన సామర్థ్యాల తో ముందుకు సాగుతూ ఉన్నందువల్ల భారతదేశ ఆర్థిక జగతి లో భాగం గా ఉన్న వారి యొక్క బాధ్యత పెరిగిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. వారు ప్రపంచం లో ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ను కలిగివున్నారు. అంతేకాదు, ఎనిమిది- పది సంవత్సరాల కిందట పతనం అంచు లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ లాభాల దశ కు చేరుకొంది అని ఆయన శ్రోతల కు వివరించారు. అలాగే ధైర్యం తో, స్పష్టత తో మరియు విశ్వాసం తో విధాన నిర్ణయాల ను తీసుకుంటున్న ప్రభుత్వం సైతం ఉంది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం బ్యాంకింగ్ వ్యవస్థ లోని బలం తాలూకు ప్రయోజనాలు ప్రజల లో సాధ్యమైనంత ఎక్కువ మంది కి చేరాలి అనేది ఇప్పటి కాలం యొక్క అవసరం గా ఉంది’’ అని ఆహ్వానితుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి పేర్కొన్నారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య సంస్థ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగాని కి ప్రభుత్వం అందిస్తున్న సమర్థన ను గురించి ప్రధాన మంత్రి ఒక ఉదాహరణ ను ఇస్తూ, బ్యాంకింగ్ వ్యవస్థ వీలయినన్ని ఎక్కువ రంగాల కు సేవ ను అందించాలని సూచించారు. ‘‘కరోనా కాలం లో ఒక కోటి ఇరవై లక్షల ఎమ్ఎస్ఎమ్ఇ స్ ప్రభుత్వం వద్ద నుండి పెద్ద ఎత్తున సాయాన్ని అందుకొన్నాయి. ఈ సంవత్సరం బడ్జెటు లో ఎమ్ఎస్ఎమ్ఇ రంగాని కి అదనం గా 2 లక్షల కోట్ల రూపాయల అనుబంధ పూచీకత్తు అవసరపడనటువంటి, హామీ కలిగిన పరపతి కూడా అందింది. మన బ్యాంకు లు ఎమ్ఎస్ఎమ్ఇ ల చెంతకు పోయి వాటికి తగినంత ఆర్థిక సహాయాన్ని అందించడం ఇప్పుడు ఇక చాలా ముఖ్యం’’ అని ఆయన అన్నారు.

అన్ని వర్గాల కు ఆర్థిక సేవల అందజేత కు సంబంధించిన ప్రభుత్వ విధానాలు కోట్ల కొద్దీ ప్రజల ను లాంఛనప్రాయ ఆర్థిక వ్యవస్థ లో భాగం గా చేసివేశాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. బ్యాంకు పూచీకత్తు అక్కర లేకుండానే 20 లక్షల కోట్ల రూపాయల కు పైచిలుకు ‘ముద్ర’ రుణాల ను ఇవ్వడం ద్వారా కోట్ల కొద్దీ యువతీ యువకులు వారి కలల ను నెరవేర్చుకోవడం లో వారికి ప్రభుత్వం సాయపడింది. మొట్టమొదటిసారి గా 40 లక్షల కు పైగా వీధి వ్యాపారస్తులు మరియు చిన్న దుకాణదారులు ‘పిఎమ్ స్వనిధి యోజన’ ద్వారా బ్యాకుల నుండి ఆర్థిక సహాయాన్ని అందుకొన్నారు అని ఆయన వివరించారు. పరపతి సౌకర్యం తాలూకు ఖర్చు ను తగ్గించి, రుణాల ను వేగం గా మంజూరు చేసేందుకు గాను ప్రక్రియలన్నిటి లో మార్పుచేర్పుల ను చేసుకోవాలని, అదే జరిగితే చిన్న నవపారిశ్రామికవేత్తలు త్వరితగతి న పరపతి సౌకర్యాని కి నోచుకొంటారని, ఈ కార్యకలాపాల తో సంబంధం కలిగివున్న వర్గాల కు ఆయన పిలుపు ను ఇచ్చారు.

‘వోకల్ ఫార్ లోకల్’ అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది ఇష్టాని కి సంబంధించిన అంశం కాదు, ‘‘వోకల్ ఫార్ లోకల్ మరియు స్వయంసమృద్ధి సంబంధి దృష్టికోణం అనేవి దేశ ప్రజల బాధ్యత లు.’’ అని పేర్కొన్నారు. వోకల్ ఫార్ లోకల్ మరియు ఆత్మనిర్భరత లకు దేశం లో ఎక్కడ లేని ఉత్సాహం వ్యక్తం అవుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, దేశీయ ఉత్పత్తి అధికం కావడాన్ని గురించి మరియు ఎగుమతుల లో ఇదివరకు ఎన్నడూ లేనంత వృద్ధి ని గురించి ప్రస్తావించారు. ‘‘మన ఎగుమతులు- అది వస్తువులు కావచ్చు, లేదా సేవలు కావచ్చు- అపూర్వ స్థాయి కి చేరుకొన్నాయి. ఈ పరిణామం భారతదేశం లో పెచ్చుపెరుగుతున్న అవకాశాల ను గురించి తెలియ జేస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్థానిక చేతి వృత్తుల శ్రమికుల ను మరియు నవపారిశ్రామికవేత్తల ను ప్రోత్సహించే బాధ్యత ను స్వీకరించవలసింది గా సంస్థల ను మరియు పరిశ్రమ, ఇంకా వాణిజ్యం ల మండలు లను తదితర స్టేక్ హోల్డర్స్ ను ప్రధాన మంత్రి కోరారు.

వోకల్ ఫార్ లోకల్ అనేది భారతదేశం లో కుటీర పరిశ్రమ కు చెందిన ఉత్పాదనల ను కొనుగోలు చేయడం ఒక్కటే కాదు, అది అంతకంటే ప్రముఖమైంది అని ప్రధాన మంత్రి మరోసారి స్పష్టత ను ఇచ్చారు. ‘‘భారతదేశం లో నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందింప చేయడం ద్వారా మనం ఏయే రంగాల లో దేశం యొక్క డబ్బు ను మిగల్చ గలుగుతాం అనేది మనం పరిశీలన జరపవలసిన అవసరం ఉన్నది’’ అని ఆయన అన్నారు. ఇదే సందర్భం లో ఉన్నత విద్య, ఇంకా వంటల కు ఉపయోగించే నూనె.. ఈ అంశాల లో ఎంతో డబ్బు దేశం బయట కు తరలిపోతోంది అని ఆయన ఉదాహరణ గా చెప్పారు.

బడ్జెటు లో మూలధన వ్యయం తాలూకు కేటాయింపు ను 10 లక్షల కోట్ల రూపాయల కు భారీ గా పెంచిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, పిఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లాను తో ప్రోజెక్టు యొక్క ప్రణాళికరచన, ఇంకా దాని అమలు ప్రక్రియల లో ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి జోరు కానవస్తోంది అన్నారు. దేశం లో వేరు వేరు ప్రాంతాల లో పురోగతి కోసం కృషి చేస్తున్న ప్రైవేటు రంగాని కి సాధ్యమైనంత ఎక్కువ గా సమర్థన ను అందించవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు న నేను దేశం లోని ప్రైవేటు రంగాని కి ఒక ఆహ్వానాన్ని ఇవ్వదలచుకొన్నాను. అది ఏమిటి అంటే ప్రభుత్వం వలెనే ప్రైవేటు రంగం లోని శక్తులు వాటి పెట్టుబడి ని పెంచాలి; అదే జరిగితే దాని నుండి వీలైనంత ఎక్కువ స్థాయి లాభాన్ని దేశం అందుకొంటుంది.’’ అని ఆయన అన్నారు.

బడ్జెటు అనంతర కాలం లో పన్నుల కు సంబంధించిన ఘటన క్రమాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, మునుపటి కంటే భిన్నం గా పన్నుల భారం భారతదేశం లో చెప్పుకోదగినంత స్థాయి లో తగ్గింది. జిఎస్ టి, ఆదాయపు పన్నులోను మరియు కార్పొరేట్ పన్ను లోను తగ్గింపు లు చోటు చేసుకోవడమే దీనికి కారణం అన్నారు. ఇది మెరుగైన పన్ను వసూళ్ళ కు దారి తీసిందని ఆయన చెప్పారు. 2013-14 లో పన్నుల రూపేణ అందినటువంటి స్థూల ఆదాయం దాదాపు 11 లక్ష ల కోట్ల రూపాయలు. అయితే ఇది 2023-24 కు 33 లక్షల కోట్ల రూపాయల కు పెరిగేందుకు ఆస్కారం ఉంది. అది 200 శాతం వృద్ధి కింద కు లెక్కకు వస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. 2013-14 నుండి 2020-21 మధ్య కాలం లో దాఖలు అయిన వ్యక్తిగత పన్ను రిటర్ను ల సంఖ్య 3.5 కోట్ల నుండి 6.5 కోట్ల కు చేరుకొంది. ‘‘పన్నుల ను చెల్లించడం ఎటువంటి కర్తవ్యం అంటే అది దేశ నిర్మాణం తో నేరు సంబంధాన్ని కలిగినటువంటిది. పన్నుల ను చెల్లించే వారి సంఖ్య లో పెరుగుదల ప్రభుత్వం పట్ల ప్రజల కు ఉన్నటువంటి నమ్మకాని కి రుజువు. అంతేకాదు, వారు చెల్లించిన పన్నుల తాలూకు సొమ్ము ను ప్రజల హితం కోసం ఖర్చు చేయడం జరుగుతోందని వారు నమ్ముతున్నారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లోని ప్రతిభావంతులు, భారతదేశం లోని మౌలిక సదుపాయాలు మరియు భారతదేశం లోని నూతన ఆవిష్కర్తలు దేశ ఆర్థిక వ్యవస్థ ను అగ్రస్థానాని కి తీసుకు పోవడానికి సమర్థులు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ ‘ఇండస్ట్రీ 4.0’ కాలం లో భారతదేశం అభివృద్ధి పరచినటువంటి ప్లాట్ ఫార్మ్ స్ ప్రపంచాని కి నమూనాలు గా అవుతున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఆయన జిఇఎమ్ (GeM) ను, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ ను ఉదాహరించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాతి 75 వ సంవత్సరం లో 75,000 కోట్ల లావాదేవీ లు డిజిటల్ మాధ్యం ద్వారా జరగడం యుపిఐ ఎంత విస్తారం గా వ్యాపించిందో సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘రూపే మరియు యుపిఐ లు తక్కువ ఖర్చు మరియు అధిక భద్రత తో కూడిన సాంకేతిక మాధ్యమాలు మాత్రమే కాక ప్రపంచం లో మనకు గుర్తింపు ను అవి తీసుకు వచ్చాయి కూడా అని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణ కు అపారమైనటువంటి అవకాశం ఉంది. యుపిఐ అనేది అన్ని వర్గాల ను ఆర్థిక సేవ ల పరిధి లోకి చేర్చేందుకు ఒక సాధనం గా అవ్వాలి; అంతేకాదు యావత్తు ప్రపంచం లో సశక్తీకరణ కు అది ఒక మార్గం అవ్వాలి, దీనికోసం మనం సామూహికం గా పాటుపడవలసివుంది. నేను మన ఆర్థిక సంస్థల కు చేస్తున్న సూచన ఏమిటి అంటే అది మన ఆర్థిక సంస్థ లు వాటి పరిధి ని పెంచుకోవడం కోసం ఫిన్ టెక్ స్ తో గరిష్ఠ భాగస్వామ్యాన్ని కలిగివుండాలి అనేదే అని ప్రధాన మంత్రి తెలిపారు.

ఒక్కొక్కసారి అతి చిన్నదైనటువంటి చర్య సైతం ఉత్సాహాన్ని పెంచడం లో చాలా పెద్ద తేడా ను తీసుకు రాగలదని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, బిల్లు ను తీసుకోకుండానే వస్తువుల ను కొనే ధోరణి ని గురించిన ఉదాహరణ ను ఇచ్చారు. ఈ కార్యం లో ఎటువంటి హాని లేదు అనే భావన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఒక బిల్లు యొక్క ప్రతి ని తీసుకొంటే అది దేశ ప్రజల కు మేలు చేసేది అవుతుంది అనేటటువంటి జాగరూకత ను ప్రజల లో పెంచవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ‘‘మనం చేయవలసిందల్లా ప్రజల ను మరింత ఎక్కువ జాగరూకులను గా చేయడమే’’ అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి తాలూకు ఫలాలు ప్రతి ఒక్క తరగతి కి మరియు ప్రతి ఒక్క వ్యక్తి కి అందాలి అని పేర్కొంటూ, ఈ దృష్టికోణం తో పని చేయవలసిందిగా స్టేక్ హోల్డర్స్ అందరికి విజ్ఞప్తి చేశారు. సుశిక్షితులైన వృత్తి నిపుణుల తో కూడిన ఒక పెద్ద సమూహాన్ని తయారు చేయాలి అని కూడా ఆయన నొక్కిచెప్పారు. ‘‘ఆ తరహా పురోగామి ఉపాయాల ను మీరంతా విస్తారం గా చర్చించాలి అని నేను కోరుకొంటున్నాను’’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"