షేర్ చేయండి
 
Comments
In an interdependent and interconnected world, no country is immune to the effect of global disasters: PM
Lessons from the pandemic must not be forgotten: PM
Notion of "resilient infrastructure" must become a mass movement: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంట‌ర్‌నేశ‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ డిజాస్ట‌ర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ తాలూకు ఆరంభిక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.  ఈ కార్య‌క్ర‌మం లో ఫిజీ ప్ర‌ధాని, ఇట‌లీ ప్ర‌ధాని, యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్ర‌ధాని పాలుపంచుకొన్నారు.  ఈ స‌మావేశం లో జాతీయ ప్ర‌భుత్వాల ప్ర‌తినిధులు, అంత‌ర్జాతీయ సంస్థల‌ కు చెందిన  నిపుణులు, విద్యా సంస్థ‌లు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు.  


ప్ర‌స్తుతం ఉన్న‌టువంటి ఈ స్థితి ని ఇదివ‌ర‌కు ఎన్న‌డూ ఎరుగ‌ము అని ప్ర‌దాని అన్నారు.  ‘‘మ‌నం వంద సంవ‌త్స‌రాల కాలం లో ఒక‌సారి ఎదురుప‌డే  విప‌త్తు అని వ్య‌వ‌హ‌రిస్తున్న ఘ‌ట‌న‌ ను చూస్తున్నాము.  కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి మ‌న‌కు ప‌ర‌స్ప‌ర సంధానం క‌లిగిన‌టువంటి, ప‌ర‌స్ప‌రం ఆధార‌ప‌డిన‌టువంటి, ప్రపంచం లో అది ధ‌నిక దేశ‌మా లేదా పేద దేశ‌మా, అది తూర్పు దిక్కున ఉన్న దేశ‌మా లేదా ప‌శ్చిమ దిక్కున ఉన్న దేశ‌మా, ఉత్తర దిక్కున ఉన్న దేశ‌మా లేదా ద‌క్షిణ దిక్కున ఉన్న దేశ‌మా అనే అంశం తో సంబంధం లేకుండా ప్ర‌పంచ విప‌త్తుల ప్ర‌భావం బారిన ప‌డ‌న‌టువంటి దేశం ఏదీ లేద‌ని నేర్పింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌పంచం ఏ ర‌కం గా ఒక్క తాటి మీద నిల‌బ‌డ‌గ‌లుగుతుంద‌నేది మ‌హ‌మ్మారి చాటింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘ప్ర‌పంచ స‌వాళ్ళ‌ ను ప‌రిష్క‌రించ‌గ‌లిగే నూత‌న ఆవిష్క‌ర‌ణ ఎక్క‌డ నుంచి అయినా రాగ‌ల‌దు అని మ‌హ‌మ్మారి తెలియ‌జేసింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ విష‌యంలో శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచం లో అన్ని ప్రాంతాల లో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ ను స‌మ‌ర్ధించేట‌టువంటి  ఒక గ్లోబ‌ల్ ఇకో సిస్ట‌మ్ ను పెంచి పోషించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని, దానిని అత్య‌వ‌స‌ర‌మైన ప్రాంతాల కు బ‌ద‌లాయించాల‌ని పిలుపునిచ్చారు.  2021వ సంవ‌త్స‌రం మ‌హ‌మ్మారి బారి నుంచి త్వ‌రిత‌గ‌తిన కోలుకొనే సంవ‌త్స‌రం గా ఆశ ను రేకెత్తిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

మ‌హ‌మ్మారి నుంచి నేర్చుకొన్న పాఠాల ను మ‌ర‌చిపోకూడ‌ద‌ని ప్ర‌ధాన ‌మంత్రి జాగ్ర‌త్త చెప్పారు.  అవి కేవ‌లం ప్ర‌జారోగ్య విప‌త్తుల కు మాత్ర‌మే వ‌ర్తించ‌బోవ‌ని, ఇత‌ర విప‌త్తుల విష‌యం లోను అవి వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న అన్నారు.  జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న ప్ర‌భావాన్ని త‌గ్గించే దిశ లో నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి ఉమ్మ‌డి కృషి ఎంతైనా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న రంగం లో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్న‌టువంటి భార‌త‌దేశాన్ని పోలిన దేశాలు ఇది రిస్కు ప‌రంగా పెడుతున్న పెట్టుబ‌డి కాద‌ని, విప‌త్క‌ర స్థితి కి ఎదురొడ్డి నిల‌వ‌డంపై పెడుతున్న‌టువంటి పెట్టుబ‌డి అనే సంగ‌తి ని ఖాయ‌ప‌ర‌చుకోవాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  డిజిట‌ల్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, శిప్పింగ్ లైన్స్‌, విమాన‌యాన సంబంధిత నెట్‌వ‌ర్క్ లు వంటి అనేక మౌలిక స‌దుపాయ సంబంధిత వ్య‌వ‌స్థ‌ లు యావ‌త్తు ప్ర‌పంచం తో సంబంధం క‌లిగి ఉన్న‌వి అని, ప్ర‌పంచం లోని ఒక భాగం లో దాపురించే విప‌త్తు తాలూకు ప్ర‌భావం ప్ర‌పంచం మొత్తానికి చాలా శీఘ్రం గా వ్యాప్తి చెందే ఆస్కారం ఉంద‌ని ఆయ‌న అన్నారు. గ్లోబ‌ల్ సిస్ట‌మ్ తాలూకు ప్ర‌తిఘాతుక‌త్వానికి పూచీ ప‌డాలి అంటే, అందుకు స‌హ‌కారం అనేది అత్యంత అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.  ‘‘ప్ర‌పంచంలోని ద‌క్షిణ ప్రాంతాల లో నెల‌కొన్న  స‌హ‌కార పూర్వ‌క యంత్రాంగం అయిన‌టువంటి సిడిఆర్ఐ ఈ అజెండా ను ముందుకు తీసుకుపోవ‌డానికి ఒక సముచిత‌మైన వేదిక ను అందిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.  మౌలిక స‌దుపాయాల‌ ను దీర్ఘ‌కాల ప్రాతిప‌దిక తో అభివృద్ధిప‌ర‌చ‌డం జ‌రుగుతోంద‌ని’’ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

 
2021వ సంవ‌త్స‌రం ప్ర‌ధానం గా ముఖ్య‌మైన సంవ‌త్స‌రంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  మనం సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాలు, ప్యారిస్ ఒప్పందం, సెండ‌యీ ఫ్రేమ్ వ‌ర్క్ ల మ‌ధ్య బిందువు వ‌ద్ద‌కు చేరుకొంటున్నాం, ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్థం లో ఇట‌లీ, యుకె లు ఆతిథ్యం ఇవ్వ‌బోయేట‌టువంటి సిఒపి-26 పైన ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్నాం.  ప్ర‌తిఘాతుక‌త్వ శ‌క్తి క‌లిగిన మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న తాలూకు ఈ భాగ‌స్వామ్యం ఆ ఆశ‌ల లో కొన్నింటినైనా నెర‌వేర్చుకోవ‌డం లో ఒక ముఖ్య‌మైన పాత్ర‌ ను పోషించ‌వ‌ల‌సి ఉన్న‌ది ఆయ‌న అన్నారు.

కీల‌క ప్రాధాన్యాన్ని ఇవ్వ‌వ‌ల‌సిన‌టువంటి రంగాలు ఏమేమిట‌న్న‌ది ప్ర‌ధాన మంత్రి విడ‌మ‌ర‌చి చెప్పారు.  ఒక‌టోది ఏమిటంటే, సిడిఆర్ఐ అనేది సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల తాలూకు ప్ర‌ధాన వాగ్ధానాన్ని త‌న‌లో ఇముడ్చుకోవాలి.  ఏ ఒక్క దేశాన్ని వెనుక‌ప‌ట్టున వ‌ద‌లి వేయ‌కూడ‌దు అనేదే ప్ర‌ధాన‌మైన‌టువంటి వాగ్ధానం గా ఉంది.  దీనికి అర్థం మ‌నం అత్యంత దుర్భ‌ల‌మైన‌టువంటి దేశాల మ‌రియు స‌ముదాయాల ఆందోళ‌న‌ల కు ప్రాముఖ్యం ఇవ్వాలి అనేదే.  రెండ‌వ రంగం ఏమిటంటే, మ‌నం కొన్ని కీల‌క మౌలిక స‌దుపాయాల రంగాల ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాలి.  మ‌రీ ముఖ్యం గా ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాలు, డిజిట‌ల్ ప‌ర‌మైన మౌలిక స‌దుపాయాల రంగాల‌ ను గురించి శ్ర‌ద్ధ తీసుకోవాలి.  మ‌హ‌మ్మారి కాలం లో ముఖ్య పాత్ర పోషించింది ఈ రంగాలే.  ఈ రంగాల నుంచి నేర్చుకొనేట‌టువంటి పాఠాలు ఏమిటి?  వాటిని భ‌విష్య‌త్తు లో మ‌రింత ప్ర‌తిఘాతుక‌త్వం క‌లిగిన‌విగా మ‌నం ఎలా తీర్చిదిద్ద‌గ‌లుగుతాము?  మూడో రంగం ఏమిటి అంటే, ప్ర‌తిఘాతుక‌త్వం కోసం మ‌నం సాగిస్తున్న అన్వేష‌ణ లో ఎటువంటి సాంకేతిక విజ్ఞాన సంబంధిత వ్య‌వ‌స్థ‌లు అయినా స‌రే, అది మ‌రీ ప్రాథ‌మికం గా ఉంద‌నో, లేదా బాగా ఎక్కువ‌గా అభివృద్ధి చెందింది అనో భావించ‌రాదు అనేదే.  సిడిఆర్ఐ సాంకేతిక విజ్ఞానం తాలూకు ఆచ‌ర‌ణ యొక్క కార్యాక‌ర‌ణ ప్ర‌భావాన్ని వీలైనంత అధికం గా వినియోగం లోకి తీసుకురావాలి.  ఇక అంతిమంగా చూసిన‌ప్పుడు ‘‘రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్’’ అనే భావ‌న ఒక సామూహిక ఉద్య‌మం గా రూపొంది, నిపుణులు లాంఛ‌నప్రాయ సంస్థ‌ల శ‌క్తుల ను మాత్ర‌మే బలపరచడం అనే అంశానికి పరిమితం కాకూడదని  సూచిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 

Click here to read PM's speech

Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need

Media Coverage

During tough times, PM Modi acts as 'Sankatmochak', stands by people in times of need
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles demise of Dr. Indira Hridayesh
June 13, 2021
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the demise of Dr. Indira Hridayesh.

PMO tweeted, "Dr. Indira Hridayesh Ji was at the forefront of several community service efforts. She made a mark as an effective legislator and also had rich administrative experience. Saddened by her demise. Condolences to her family and supporters. Om Shanti: PM @narendramodi"