‘‘దేశ సంక్షేమం మరియు ప్రజా సంక్షేమం.. ఇవే శివాజీ మహారాజ్ పాలన లో మౌలిక సూత్రాలు గా ఉన్నాయి’’
‘‘శివాజీ మహారాజ్ ఎప్పటికీభారతదేశం యొక్క ఏకత్వాన్ని మరియు అఖండత్వాన్ని పరిరక్షించడాని కి అగ్రతాంబూలాన్ని ఇచ్చారు’’
‘‘ఛత్రపతి శివాజీమహారాజ్ ఆలోచన ల ప్రతిబింబాన్ని ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క దృష్టి కోణం లో గమనించవచ్చును’’
‘‘శివాజీ మహారాజ్ బానిసమనస్తత్వాన్ని సమాప్తమొనర్చి ప్రజల ను దేశ నిర్మాణం కోసం పాటుపడేటట్టు ప్రేరణ నుఅందించారు’’
‘‘ఛత్రపతి శివాజీమహారాజ్ ఆయన యొక్క విశిష్ట దృష్టికోణం కారణం గా చరిత్ర లోని ఇతర వీరుల కంటే పూర్తిగా భిన్నమైనటువంటి వారు గా ఉన్నారు’’
‘‘బ్రిటిషు హయాం గుర్తింపు కలిగిన భారతదేశం నౌకాదళం యొక్క ధ్వజాన్ని శివాజీ మహారాజ్ యొక్క ప్రతీక తో మార్చివేయడమైంది’’
‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ధైర్యం- సాహసాలు, ఆలోచన లు మరియు న్యాయం అనేక తరాల వారికి ప్రేరణ ను అందించాయి’’
‘‘ఈ యాత్ర ఛత్రపతి శివాజీమహారాజ్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడం; స్వరాజ్యం, సుపరిపాలన మరియు ఆత్మనిర్భరత ల తో పాటు అభివృద్ధిచెందిన భారతదేశం కోసం జరిగే యాత్ర అవుతుంది’’

ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజు కు 350 వ సంవత్సరం పూర్తి అయిన సందర్భాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినం రావడం ప్రతి ఒక్కరి లో సరిక్రొత్తదైనటువంటి చేతనత్వాన్ని మరియు క్రొత్త శక్తి ని తీసుకు వచ్చిందన్నారు. మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కాలం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం ఒక విశిష్టమైనటువంటి అధ్యాయం, మరి వారి స్వపరిపాలన, సుపరిపాలన మరియు సమృద్ధిల కు సంబంధించిన గొప్ప గాథలు ఈనాటి కి కూడాను అందరి కి ప్రేరణ ను ఇస్తున్నాయి అని ఆయన అన్నారు. ‘‘దేశ సంక్షేమం, ప్రజా సంక్షేమం అనేవి శివాజీ మహారాజ్ పాలన లో మౌలికాంశాలు గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. స్వరాజ్యం వచ్చాక ఒకటో రాజధాని లోని రాయ్ గఢ్ కోట ప్రాంగణం లో ఒక భవ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, మరి ఆ రోజు ను మహారాష్ట్ర అంతటా ఒక ఉత్సవం వలె జరుపుకొంటూ ఉంటారు అని ఆయన వివరించారు. మహారాష్ట్ర లో ఈ తరహా కార్యక్రమాల ను ఏడాది పొడవునా నిర్వహించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ దిశ లో పథక రచన చేసినందుకు మరియు కార్యాచరణ కు నడుం కట్టి కట్టినందుకు మహారాష్ట్ర ప్రభుత్వాని కి ఆయన అభినందనల ను తెలియ జేశారు.

మూడు వందల యాభై సంవత్సరాల కిందట ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన సందర్భం లో ఆ వేడుక లో స్వరాజ్యం యొక్క స్ఫూర్తి, మరియు జాతీయ వాదం యొక్క భావన కలగలసి పోయాయి అని ప్రధాన మంత్రి అన్నారు. శివాజీ మహారాజ్ భారతదేశం యొక్క ఏకత్వాన్ని మరియు అఖండత్వాన్ని పరిరక్షించడాని కి ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు అని ఆయన అన్నారు. ఈ రోజు న ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలోచన లు ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ యొక్క దృష్టి కోణం లో ప్రతిబింబించడాన్ని గమనించవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు.

పౌరుల ను ప్రేరితుల ను చేయడం మరియు వారి లో నమ్మకాన్ని కలిగించడం అనేవి నాయకుల బాధ్యత లు అని ప్రధాన మంత్రి నొక్కి పలుకుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం లో దేశం లో నెలకొన్న ఆత్మవిశ్వాసం స్థాయిల ను ఇట్టే ఊహించవచ్చును అన్నారు. వందల సంవత్సరాల తరబడి దాస్యం లో మగ్గినందువల్ల పౌరుల లో ఆత్మవిశ్వాసం అడుగంటిపోయింది ఆ కాలం లో ఆక్రమణదారుల దండయాత్ర లు మరియు పీడన ల కారణం గా, దానితో పాటు మరో ప్రక్కన పేదరికం సమాజాన్ని బలహీనపరచాయి అని ఆయన ప్రస్తావించారు. ‘‘మన సాంస్కృతిక కేంద్రాల పై దాడుల ను జరిపి ప్రజల మనోబలం వీగిపోయేటట్టు చేసే ప్రయత్నం జరిగింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కాగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆక్రమణదారుల కు ఎదురొడ్డి పోరాడడం ఒక్కటే కాకుండా, స్వపరిపాలన అనేది సంభవమే అనేటటువంటి ఒక నమ్మకాన్ని కూడా ప్రజల లో పాదుగొల్పారు అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘బానిస మనస్తత్వాన్ని శివాజీ మహారాజ్ సమాప్తం చేసి ప్రజల ను దేశ నిర్మాణం కోసం ప్రేరితుల ను చేశారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

చరిత్ర లో ఎందరో పాలకులు సైన్యం లో పైచేయి ని సాధించారు అని పేరు పడిన వారు ఉన్నారు, అయితే వారి లో పాలన పరమైన దక్షత బలహీనం గా ఉండింది, అదే విధం గా ఎంతో మంది పాలకులు పరిపాలన లో అందెవేసిన చేయి గా పేరు తెచ్చుకొన్నప్పటికీ సైనిక పరం గా వారి నాయకత్వం బలహీనం గా ఉండింది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఏమైనా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వం అమోఘమైంది, ఎందుకంటే ఆయన ‘స్వరాజ్యం’ తోపాటు ‘సురాజ్యాన్ని’ స్థాపించారు అని ప్రధాన మంత్రి అన్నారు. శివాజీ మహారాజ్ ఎంతో చిన్న వయస్సు లోనే శత్రువుల ను పరాజయం పాలు చేసి, విజయాల తో తన సైనిక నాయకత్వాన్ని నిరూపించుకొన్నారు, మరో ప్రక్క ఒక రాజు గా ప్రజా పాలన లో సంస్కరణల ను అమలు చేసి సుపరిపాలన ఎలా ఉండాలో చూపెట్టారు అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఆక్రమణదారుల బారి నుండి శివాజీ మహారాజ్ తన రాజ్యాన్ని మరియు సంస్కృతి ని రక్షించుకొంటూనే, దేశ నిర్మాణం తాలూకు ఒక సంపూర్ణమైనటువంటి దృష్టికోణాన్ని కూడా ఆవిష్కరించారన్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన దృష్టి కోణం రీత్యా చరిత్ర లో ఇతర వీరుల కంటే పూర్తి గా భిన్నమైనటువంటి వారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. శివాజీ మహారాజ్ పాలన తాలూకు ప్రజా సంక్షేమ స్వభావాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, అది ప్రజలు ఆత్మ గౌరవం తో నివసించేందుకు బరోసా ను కల్పించిందన్నారు. దీనితో పాటు, స్వరాజ్, ధర్మం, సంస్కృతి మరియు వారసత్వాల ను దెబ్బతీయాలని చూసేటటువంటి వారి కి ఒక బలమైన సందేశాన్ని కూడా ఇచ్చారు, ఇది ప్రజల లో విశ్వాసాన్ని ప్రోది చేసి ఆత్మ నిర్భరత తాలూకు స్ఫూర్తి ని వ్యాప్తి లోకి తెచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు. అంతేకాకుండా, ఇది దేశ ప్రజల కు గల గౌరవాన్ని వర్థిల్ల జేసింది అని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కావచ్చు, మహిళల సశక్తీకరణ కావచ్చు, లేదా పాలన ను సామాన్య మానవుని చెంత కు తీసుకు పోవడం కావచ్చు.. శివాజీ మహారాజ్ అనుసరించిన పాలన వ్యవస్థ మరియు ఆయన విధానాలు ఈ రోజు కు కూడాను సమాన స్థాయి లో ప్రాసంగికమైనవి గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వ్యక్తిత్వం లోని అనేక అంశాలు ఏదో ఒక విధం గా వర్తమానం లో మన మీద ప్రభావాన్ని ప్రసరిస్తున్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం యొక్క సముద్ర సంబంధి శక్తియుక్తుల ను గుర్తించడం, నౌకాదళం విస్తరణ కు పూనుకోవడం మరియు ఆయన యొక్క నిర్వహణ సంబంధి దక్షత లు ప్రస్తుతం అందరికీ ప్రేరణ ను అందిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన నిర్మించిన కోట లు మహా సముద్రం మధ్య లో తీవ్రమైనటువంటి అలల ఆటు పోటుల కు ఎదురీది ఇప్పటికీ సగర్వం గా నిలచి ఉండడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆయన సామ్రాజ్య విస్తరణ ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆయన సముద్ర తీర ప్రాంతం మొదలుకొని పర్వతాల వరకు కోటల ను నిర్మిస్తూ వచ్చారు అన్నారు. ఆ కాలం లో జల నిర్వహణ సంబంధి ఏర్పాటులు నిపుణుల నే సంభ్రమం లో ముంచెత్తాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. శివాజీ మహారాజ్ నుండి అందిన ప్రేరణ ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశం కిందటి ఏడాది లో నౌకాదళాన్ని దాస్యం తాలూకు చిహ్నం బారి నుండి బయటకు తీసుకు వచ్చిందని, భారతదేశం నావికాదళాని కి అస్తిత్వం గా ఉంటూ వచ్చిన బ్రిటిషు హయాము కు చెందిన ద్వజాన్ని తొలగించి శివాజీ మహారాజ్ యొక్క ప్రతీక ను ప్రవేశ పెట్టడం జరిగింది అని వివరించారు. ‘‘ప్రస్తుతం ఈ ధ్వజం సముద్రం లో మరియు గగన తలం లో ‘న్యూ ఇండియా’ యొక్క స్వాభిమానాని కి ఒక ప్రతీక గా ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ధైర్యం, సాహసం, ఆలోచన లు మరియు న్యాయం అనేవి అనేక తరాల కు ప్రేరణ గా నిలచాయి. ఆయన సాహసిక కార్యశైలి, వ్యూహాత్మకమైనటువంటి కౌశలం మరియు శాంతిపూర్ణమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఈ నాటికీ మనకు ఒక ప్రేరణ గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించే సందర్భం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విధానాలు ప్రపంచం లో అనేక దేశాల లో చర్చనీయాంశం గా ఉన్నాయని, ఆ విధానాల పై పరిశోధన జరుగుతూ ఉండడం గర్వకారణమన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఒక నెల రోజుల క్రితం మారిశస్ లో నెలకొల్పారని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ‘‘ఆజాదీ కా అమృత్ కాల్ సందర్భం లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాని కి 350 సంవత్సరాలు పూర్తి కావడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఘట్టం గా ఉంది. ఎన్నో సంవత్సరాలు గడచిన తరువాత సైతం ఆయన నెలకొల్పిన విలువ లు మనకు మార్గదర్శనం చేస్తున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే 25 సంవత్సరాల అమృత కాలం తాలూకు యాత్ర ను ఈ విలువ ల ఆధారం గా ముగించుకోవలసిన అవసరం ఉంది అని పేర్కొంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘ఈ యాత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడాని కి జరిపే యాత్ర అవుతుంది, స్వరాజ్యం, సుపరిపాలన మరియు ఆత్మనిర్భరత ల తో కూడిన ఈ ప్రస్థానం అభివృద్ధి చెందిన భారతదేశం సాగించే యాత్ర అవుతుంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Parliament passes Bharatiya Vayuyan Vidheyak 2024

Media Coverage

Parliament passes Bharatiya Vayuyan Vidheyak 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM bows to Sri Guru Teg Bahadur Ji on his martyrdom day
December 06, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Guru Teg Bahadur Ji on his martyrdom day. Prime Minister, Shri Narendra Modi recalled the unparalleled courage and sacrifice of Sri Guru Teg Bahadur Ji for the values of justice, equality and the protection of humanity.

The Prime Minister posted on X;

“On the martyrdom day of Sri Guru Teg Bahadur Ji, we recall the unparalleled courage and sacrifice for the values of justice, equality and the protection of humanity. His teachings inspire us to stand firm in the face of adversity and serve selflessly. His message of unity and brotherhood also motivates us greatly."

"ਸ੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਸ਼ਹੀਦੀ ਦਿਹਾੜੇ 'ਤੇ, ਅਸੀਂ ਨਿਆਂ, ਬਰਾਬਰੀ ਅਤੇ ਮਨੁੱਖਤਾ ਦੀ ਰਾਖੀ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਲਈ ਲਾਸਾਨੀ ਦਲੇਰੀ ਅਤੇ ਤਿਆਗ ਨੂੰ ਯਾਦ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਾਨੂੰ ਮਾੜੇ ਹਾਲਾਤ ਵਿੱਚ ਵੀ ਦ੍ਰਿੜ੍ਹ ਰਹਿਣ ਅਤੇ ਨਿਰਸੁਆਰਥ ਸੇਵਾ ਕਰਨ ਲਈ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਏਕਤਾ ਅਤੇ ਭਾਈਚਾਰੇ ਦਾ ਉਨ੍ਹਾਂ ਦਾ ਸੁਨੇਹਾ ਵੀ ਸਾਨੂੰ ਬਹੁਤ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦਾ ਹੈ।"